దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న  ఆందోళనలలో భాగంగా చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ తెర పైకి తీసుకు వచ్చిన వింత డిమాండ్ ప్రస్తుతం షాకింగ్ న్యూస్ గా మారింది. దేశంలోని  శరణార్థులందరికీ పౌరసత్వం ఇస్తున్నప్పుడు గుళ్లలో దేవుళ్లకు ఎందుకు ఇవ్వరని ఆయన వేస్తున్న ప్రశ్నలు ఇప్పడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

అంతేకాదు చిలుకూరి బాలాజీ స్వామికి కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.  ఇలా రంగ రాజన్ ఈ వింత డిమాండ్ ను తెర పైకి తీసుకు రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు కాబట్టి   దేవుళ్లంతా పిల్లలే అని ఆయన అభిప్రాయ పడుతూ దేవుళ్ళు అందరు మైనర్లు మాత్రమే అని రంగ రాజన్ ఒక కొత్త వాదాన్ని తెర పైకి తీసుకు వస్తున్నారు. 

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 (4) ప్రకారం మైనర్‌ కి పౌరసత్వ హక్కులు ఇవ్వొచ్చు అన్న నిభందన ప్రకారం దేశంలోని అన్ని ఆలయాల్లోని దేవుళ్లకూ పౌరసత్వం ఇవ్వాలన్నది ఆయన వింత డిమాండ్. 

ఈ నేపధ్యంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికీ శబరిమలలో అయ్యప్ప స్వామికీ కేరళలో పద్మనాభస్వామికీ ఆ సెక్షన్ కింద పౌరసత్వం ఇవ్వాలని రంగరాజన్ డిమాండ్ చేయడమే కాకుండా దానికోసం ఉద్యమం కూడ చేస్తాను అంటున్నారు. వినడానికి రంగ రాజన్ చేస్తున్న కామెంట్స్ నవ్వు తెప్పిస్తున్న ఆ కామెంట్స్ వెనుక ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పరిస్థితుల పై రంగ రాజన్ అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే  పౌరసత్వ సవరణ చట్టం పై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మేధావులు అభ్యంతారాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో తిరుపతి వెంకన్నకు భారత పౌరసత్వం లభిస్తుందో లేదో చూడాలి. అదే జరిగితే దేశంలోని ప్రధాన ఆలయాలలోని దేవుళ్ళతో పాటు గ్రామ దేవతలకు కూడ పౌరసత్వం ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: