తాము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఏపీలో బలపడ లేకపోతున్నామనే బీజేపీ పెద్దల్లో ఎక్కువగా ఉంది. తాము ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా బలమైన పార్టీగా ఏపీలో నిలబడలేక పోతున్నామనే బాధ కేంద్ర అధికార పార్టీ బీజేపీలో ఉంది. ఎప్పటి నుంచో ఏపీలో బలమైన పార్టీగా బిజెపి ని తీర్చిదిద్దాలని చూస్తున్నా ఏపీ ప్రజలు మాత్రం ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఆదరణ ఉన్నా ఏపీ, తెలంగాణ విడిపోయిన తరువాత ఆ పార్టీ ఏపీలో పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఇక అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలే ఏపీలో అధికారాన్ని శాసిస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఒకటి రెండు స్థానాలు వస్తున్నాయి. 


సొంతంగా పోటీ చేస్తే అది కూడా లేదు.  కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఎలా అయినాసరే ఏపీలో బలమైన పునాదులు వేసుకునే వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని చూస్తోంది. దీనిలో భాగంగా బిజెపి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా ఏపీలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులను దగ్గర చేసుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కూడా బీజేపీలో కి తీసురావాలని చూస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీ లోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 


వాస్తవానికి ముద్రగడ బీజేపీలో పనిచేసి వచ్చిన వారే. కానీ ఆ తర్వాత పరిణామాలు ఆయన పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరారు. ఆ తరువాత కాపుల బీసీల్లో చేర్చాలంటూ పోరాటం మొదలు పెట్టి ఉద్యమ నాయకుడిగా పేరు సంపాదించారు. అయితే ముద్రగడకు బీజేపీలో చేరాలని ఉన్నా కాపు రిజర్వేషన్స్ కు సంబంధించి ఏ హామీ లేకుండా బీజేపీ లో చేరితే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అందుకే బీజేపీలో తాను చేరాలంటే కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. 


లేకపోతే కాపు ద్రోహిగా మిగిలిపోతానని  ఆయన తన అభిప్రాయాన్ని సోము వీర్రాజు చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో బలపడాలంటే కాపులను బీసీల్లో చేర్చుకోవడమే మే అసలైన మార్గంగా ఆ పార్టీ భావిస్తోంది. అదీ కాకుండా కాపు రిజర్వేషన్స్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: