శాసనమండలి రద్దుకు శాసనసభ సిఫార్సు చేసినా అది అమలు కావటానికి ఎంత సమయం పడుతోందో ఎవరు చెప్పలేరని ఈ విషయంలో కింకర్తవ్యం ఏంటని అధికార పార్టీ వైఎస్ ఆర్ సీపీ తెగమల్లగుల్లలు పడిపోతుంది. మరో రెండేళ్లలో మైఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకే మెజార్టీ ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయన్న అంశం దగ్గర మండలి రద్దు ప్రక్రియుటకు చెక్ పడినట్టు తెలుస్తుంది. అలాంటి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో శాసన మండలి రద్దు ఆలోచన సరికాదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శాసనమండలిలో ఏదో విధంగా మెజార్టీ సంపాదించుకోండని పలువురు మేధావులు సూచిస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో మరి కొందరు ఇంకో అడుగు ముందుకేసి  ఒక వేళ మెజార్టీ తాత్కాలికంగా లేకున్నా.. మరో రెండేళ్ల తరువాత మన పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందన్నఅభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారని ఆ పార్టీవర్గాల కధనం . అప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా తట్టుకుందామని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తీసుకున్న సెలక్ట్‌ కమిటీ నిర్ణయాన్ని ఆయనే మార్చలేరని, అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా మార్చగలమని సీఎం జగన్ కు వాస్తవ పరిస్థితిని వివరించినట్టుగా సమాచారం.  ప్రస్తుత సమస్య నుంచి గట్టెక్కే మార్గాన్ని యోచించాలని సూచిస్తున్నట్టుగా సమాచారం.  త్వరలో సెలెక్ట్‌ కమిటీ సభ్యుల పేర్లను ఛైర్మన్‌ ప్రకటిస్తారు. శాసనమండలిలో పార్టీల బలా బలాలను బట్టి ఏ పార్టీ  నుండి ఎంత మంది సభ్యులను నియమించాలి అనే విషయంపై ఛైర్మన్‌ నిర్ణయం తీసుకుంటారు. ఎవరెవరి పేర్లు ఇవ్వాలి అనే విషయం ఆయా పార్టీ నేతలు తేల్చుకోవలసి ఉంటుంది.

ఈ నేపధ్యంలో త్వరలో సెలెక్ట్‌ కమిటీ సభ్యుల నియామకం జరుగుతుందని ఛైర్మన్‌ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలి రద్దుకు ప్రయత్నించకండి అని కొంతమంది శ్రేయోభిలాషులు జగన్‌కు నచ్చచెప్పినట్లు తెెలిసింది. దీనితో శాసనమండలి రద్దు చేయబోతున్నారని అందుకు రంగం సిద్దమైందని జరిగిన ప్రచారానికి పులిస్టాప్‌ పడింది. మీ తండ్రి దివంగత నేత వైఎస్సార్‌ శాసనమండలిని తీసుకు వచ్చారు. మీరు దానిని రద్దు చేసేందుకు ప్రయత్నించకండి అని కొందరు నేతలు ఇచ్చిన సలహాను ముఖ్యమంత్రి జగన్‌ అంగీకరించారట. నిన్న మొన్న మీడియాలో శాసనమండలి రద్దు గురించి కధనాలు ప్రచురితమయ్యాయి. ఆయా ప్రసారాలకు నేటితో పులిస్టాప్‌ పడబోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: