ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన విషయంలో జగన్ ప్రభుత్వం దూసుకుపోతున్నది.  జగన్ అనుసరిస్తున్న విధానాలు ఆ ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తున్నాయి. మంత్రులను ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉంచడం లేదు.  నిత్యం ప్రభుత్వం ఎదో ఒక విషయంలో మంత్రులను పరుగులు తీయిస్తూనే ఉన్నది.  మంత్రులు కూడా ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు.  అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఫలితాలు రాబడుతున్నది.  ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో మంచి పనులను చేస్తున్న ప్రభుత్వం మంచి ఫలితాలు రాబడుతున్న సందర్భంగా ఓ లిస్ట్ ను ప్రకటించింది.  


రాష్ట్రంలో టాప్ 10 మంత్రుల లిస్ట్ ను తీసుకొచ్చింది.  ఈ టాప్ 10 లిస్ట్ లో మోపిదేవి కూడా ఉన్నారు.  గత ఎన్నికల్లో అయన అనగాని సత్యప్రసాద్ పై ఓడిపోయారు.  అయితే, మోపిదేవికి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవిని కట్టబెట్టారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయంలో ఆయన ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రిగా పనిచేశారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుల్లో ఒకరిగా ఉన్నారు.  


అయన మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి మౌళికమైన సదుపాయాలు కల్పించడంలో కృషి చేశారు.  రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా అయన కృషి మరువలేనిదని చెప్పాలి.  దీంతో పాటుగా మోపిదేవి ఓడరేవుల విషయంలో కూడా అనేక గొప్ప పనులు చేసి శభాష్ అనిపించుకున్నారు.  ఇకపోతే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు.  ఇప్పుడు మోపిదేవి వైఎస్ జగన్ ప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్య  మరియు మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.  


తనకు ఇచ్చిన శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అయన ఎప్పుడు ముందు ఉంటాడు.  అందుకోసమే ఆయనకు ఈ శాఖను అందించారు. ఆయనకు అందించిన ఈ రెండు శాఖలు ప్రజలతో నిత్యం మమేకం అయ్యే శాఖలే.  ప్రజల నుంచి ఆయనకు మంచి పేరు ఉన్నది.  ఏ సమస్యలు ఉన్నప్పటికీ వెంటనే అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించడంలో మోపిదేవి ముందు ఉంటారు.  అందుకే ఆయనకు ఆ పదవిని కట్టబెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: