దేశం యావత్తు ఘనతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది.  ఢిల్లీలో ఈ వేడుకలు ఇండియా గెట్ వద్ద అంగరంగ వైభవంగా జరిగాయి.  ఈ ఏడాది ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు పాల్గొన్నారు.  గణతంత్ర దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం దేశం యొక్కసైనిక సంపత్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పడమే.  ఈ గణతంత్ర వేడుకల్లో ఇండియాకు వెన్నుదన్నుగా నిలిచే అనేక ఆయుధాలను ప్రదర్శించారు.  అందులో ముఖ్యంగా సీక్రెట్ ఆయుధాలను, అధిక భారం కలిగిన ఆయుధాలను సులువుగా తరలించే చినూక్ హెలికాఫ్టర్లు ఎట్రాక్షన్ గా నిలిచాయి.  


సి 5 విమానాల తరహాలోనే ఈ చినూక్ హెలికాఫ్టర్లు కూడా భారీగా ఉంటాయి.  అన్ని రకాల అవసరాలకు ఈ హెలికాఫ్టర్లు ఉపయోగపడతాయి.  2015 లో 15 హెలీకాఫ్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేశారు. గుజరాత్ లో వీటిని అసెంబ్లింగ్ చేశారు.  ఈ హెలికాఫ్టర్ 10వేల టన్నులకు పైగా పేలుడు పదార్దాలను తీసుకెళ్లగలిగే సత్తా ఉంటుంది.  అలానే ఎం 777 శతఘ్ని, జీబులను కూడా ఒకచోట నుంచి మరొక చోటుకు ఈ హెలికాఫ్టర్ సహాయంతో తరలిస్తారు.  


వీటికి రెండు రొటేటర్లు ఉంటాయి.  అయితే, ఇప్పటికే ఇండియా ఎంఐ 26 అనే భారీ హెలీకాఫ్టర్లను వినియోగిస్తోంది.  వీటిని రష్యా నుంచి కొనుగోలు చేసింది.  అయితే, వీటి ఇంజన్లు పెద్దవి కావడంతో ఇంధనం అధికంగా వృధా అవుతున్నది.  ఇకపోతే, ఈ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణ అపాచీ హెలికాఫ్టర్.  బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ హెలికాఫ్టర్ ను ఎగిరే యుద్ధ ట్యాంకర్ గా పిలుస్తారు.  ఈ తరహా హెలికాఫ్టర్ వాడుతున్న 16 వ దేశం ఇండియా కావడం విశేషం.  


దీంతో పాటుగా ఈసారి గణతంత్ర వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహిళ బైకర్స్ అని చెప్పాలి.  ఎప్పుడు ఇలాంటి సాహసాలను కేవలం పురుషులు మాత్రమే చేసేవారు.  కానీ, ఈసారి మహిళ ఆర్మీ కూడా బైకర్స్ ర్యాలీలో పాల్గొన్నారు.  రాయల్ ఎన్ ఫీల్డ్ 350 బైక్ లపై మహిళా ఆర్మీ చేసిన బైక్ సాహసాలు ఆకట్టుకున్నాయి.  మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ఎదుగుతున్నాము అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: