విజయవాడలో ఘనంగా ప్రారంభమైన  71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ . అనంతరం ప్రత్యేక వాహనం పై పెరేడ్ ను గవర్నర్ పరిశీలించారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, సిపి ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న వేడుక‌ల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలు ప్రతిబింభించేలా శ‌కటాలు ప్రదర్శన.

అందులో భాగంగా వ్యవసాయ శాఖ, గృహనిర్మాణ శాఖ, జలవనరుల శాఖ, ఆరోగ్య- వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, మద్యనిషేద మరియు అబ్కారీ శాఖ, సమగ్ర శిక్షా - పాఠశాల విద్యాశాఖ,  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, అటవీ శాఖ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ,  పర్యాటక శాఖ, మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన 14 శ‌క‌టాల ప్రదర్శన ఆహుతులను, విద్యార్ధి, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

7 నెలల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, సంక్షేమం, చేపట్టనున్న కార్యక్రమాల పై రూపొందించిన 30 పేజీల సారాంశాన్ని ప్రసంగించిన గవర్నర్. 13 జిల్లాల అభివృద్ధి కోసం అభివృద్ధి వికేంద్రికరణ, 3 రాజధానులు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న గవర్నర్. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.

నవరత్నాలు, అమ్మఒడి, రైతు భరోసా, నవశకం, గ్రామ సచివాలయం, ఇంగ్లీషు విద్య, నాడు నేడు, ప్రస్తావన. అత్యుత్తమ కవాతు నిర్వహించిన ఇండియన్ ఆర్మి ప్రధమ, తెలంగాణ పోలీస్ దళం ద్వితీయ స్తానం పొందాయి. సోషల్ వెల్ఫేర్ ప్రధమ, ఎన్ సిసి బాలికలు, ద్వితీయ పాఠశాల శకటం ప్రధమ. దిశ చట్టం మహిళ శిశుసంక్షేమం, ద్వితీయ.వ్యవసాయ శకటం తృతీయ స్థానాలు పొందాయి..వీరికి గవర్నర్ ట్రోపిలు అందచేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: