ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది ఏపీ మండలి రద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వికేంద్రీకరణ బిల్లుపై దెబ్బ తిన్న తర్వాత జగన్ కు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ జగన్ చేయవలసిందల్లా ఒకటే. ఒకటి మోడీని ప్రసన్నం చేసుకోవడం లేదా మోడీ తన శాసన మండలి రద్దు వ్యవహారంపై సానుకూలంగా స్పందించినట్లు చేసుకోవడం.

 

ఎందుకంటే శాసన మండలి రద్దు పై రాష్ట్రం తీర్మానం చేసినప్పటికీ కేంద్రం పార్లమెంటు దానిని ఆమోదించాల్సి ఉంది. అత్యధిక మెజార్టీతో బిజెపి దానిపై సానుకూల అభిప్రాయంతో ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. బిజెపి మరియు జనసేన కూటమి ఏర్పాటు చేసిన తర్వాత జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో గడ్డుకాలం మొదలైంది అన్న విషయం వాస్తవమే. అయితే దాదాపు 20కి పైగా పార్లమెంటు సభ్యులు కలిగిన జగన్ మోడీ ఇప్పుడు శాసన మండలి రద్దు విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తిస్తే జగన్ సమయం చూసి మోదీని దెబ్బ కొట్టే అవకాశం ఉంది.

 

ఇప్పటికే సీఏఏ బిల్లు ప్రవేశ పెట్టిన బిజెపి పార్టీ అటు కేంద్రంలోనూ మరియు దక్షిణాది రాష్ట్రాలలోనూ తీవ్రమైన వ్యతిరేకత సంపాదించిన నేపథ్యంలో మోడీ జగన్ కు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదు అది కూడా ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉన్న పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని.  ఇక ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుతం ఇద్దరు బిజెపి సభ్యులు ఎమ్మెల్సీలు గా ఉన్నారు మాధవ్ మరియు సోము వీర్రాజు ఎమ్మెల్సీలు కావడం వల్ల వీరి కోసం కేంద్రం శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఆపుతుందా లేక జగన్ నిర్ణయానికే కట్టు పడుతుందా అన్న విషయం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: