దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డుకు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుకు దక్షిణ భారతదేశం నుంచి పర్చూరు శాసనసభ్యులు ఎంపిక చేయడం దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఫిబ్రవరి 23న ఢిల్లీలో అతిరథ మహారథుల చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మీట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ, భారత స్టూడెంట్ పార్లమెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కార ప్రధానోత్సవం జరగనుంది. ఢిల్లీ లోని రాజపథ్ మౌలానా ఆజాద్ రోడ్డులోని విజ్ఞాన్ భవన్ లో ఫిబ్రవరి 23న పురస్కారాన్ని ఎమ్మెల్యే ఏలూరి అందుకోనున్నారు.              
ఏపీకి అరుదైన గౌరవం..    
దేశంలోని  అత్యంత  ప్రతిష్టాత్మకమైన  ఈ అవార్డు  ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యుడు  ఏలూరి సాంబశివరావు  దక్షిణ భారతదేశం నుంచి  ఎంపిక కావడం  సౌత్ ఇండియా కె  గర్వ కారణంగా భావిస్తున్నారు. ఏలూరి సాంబశివరావు  నిర్వహించిన  అన్ని రకాల  ప్రజారంజక  పాలన, సంక్షేమ పథకాలు ,నిత్యం  ప్రజలకు అందుబాటులో ఉంటూ  వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, ఇందుకోసం తన కార్యాలయంలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయడం, టీం లీడర్ షిప్, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం,  గతంలో  ఈ ప్రాంతంలో ఎవరు చేయలేని  అనేక అభివృద్ధి పనులను పూర్తి చేయడం,  ఎమ్మెల్యే ఏలూరి ఘనత. దీనితో పాటు పర్చూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎన్టీఆర్ వారధి నిర్మాణంతో పాటు గతంలో ఎవరూ సాహసించని అనేక జలవనరుల ప్రాజెక్టులను నిర్మించడం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడం, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండడం, ప్రతి సమస్య పరిష్కారానికి నేనున్నానంటూ ప్రజలకు నిత్యం భరోసా కల్పించడం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఏలూరి సాంబశివరావును ప్రతిష్ఠాత్మక ఈ జాతీయ పురస్కారాన్ని ఎంపిక చేశారు.                            

అతిరధ మహారధులు ....
భారతదేశంలోనే అరుదైన పురస్కారానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపికయారు.  దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఉత్తర భారత దేశం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లంచ్ బాలాఘాట్ ఎమ్మెల్యే(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) డిప్యూటి స్పీకర్ డాక్టర్ హినా కవ్రే లను ఈ అవార్డు వరించింది.  ఈ అవార్డు ప్రదానోత్సవానికి సెషన్  చైర్మన్ గా కర్ణాటక రాష్ట్ర శాసనసభ  స్పీకర్, గౌరవ ఉప ముఖ్యమంత్రి విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి, సభ ప్రారంభ ఉపన్యాసకులుగా ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ దినేష్ శర్మ లు పాల్గొంటారు. ప్రధాన వక్తలుగా  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, పార్లమెంటు సభ్యుడు,బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ . ప్రకాష్ జవదేకర్, మాజీ భారత ప్రభుత్వం హెచ్‌ఆర్‌డి మంత్రి . కపిల్ సిబల్ లు, గౌరవ అతిథులుగా పద్మశ్రీ ఎడిటోరియల్ డైరెక్టర్ హెచ్టి మీడియా లిమిటెడ్ , మాజీ రాజ్యసభ సభ్యురాలు శోభన భారతియా,  ద బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్   అడ్వా. డాక్టర్ లలిత్ భాసిన్ లు అతిధులుగా హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: