అయ్యో అయ్యాయో.. నెల్లూరులో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది.. ఒక్క నెల్లూరు అనే కాదు అన్నిచోట్లా టీడీపీ పరిస్థితి అలానే ఉంది. 2019 ఎన్నికల్లో ఓడినా తర్వాత నుండి టీడీపీ పరిస్థితి మరి దారుణంగా ఉంది. పాపం టీడీపీ.. ఎంత కాదు అనుకున్న పరిస్థితి అలాగే అయిపొయింది. టీడీపీ అంటేనే దారుణం అయ్యింది. 

 

టీడీపీలో ఏ నాయకుడు దైర్యం చేయలేకపోతున్నాడు.. టీడీపీ అంటేనే వెనకడుగు వేస్తున్నాడు.. టీడీపీ పరిస్థితి అంత దారుణం ఉంది మరి. ఇంకా నెల్లూరులో అయితే టీడీపీ పరిస్థితి మరి దారుణం. ఎన్నికలు ముగిసినప్పటి నుండి టీడీపీ జండా పట్టుకునే వారే లేకపోయిరి.. 

 

ప్రస్తుతం ఇప్పటి వ‌రకు ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. నెల్లూరులో టీడీపీ జెండా మోసేవారు కానీ, పార్టీ ప‌క్షాన పోటీ చేసే వారు కానీ ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల ప్రభావంతో నాయ‌కులు ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొంగూరు నారాయ‌ణ కానీ, రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మేయ‌ర్ అబ్దుల్‌ అజీజ్ కానీ ఇప్పుడు పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. 

 

ఎవ‌రికి వారు వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు. నెల్లూరు సిటీలో 30 వార్డులు, రూర‌ల్‌లో 26 వార్డులు ఉన్నాయి. పోటీ చేసేందుకు క్యాండెట్లు లేరు.. ఒక‌రో ఇద్ద‌రో గెలిచినా వైసీపీకే జంప్ అవుతారు.. అంటే ఇంకా నెల్లూరు అంత వైసీపీదే.. అన్ని ప్రాంతాలు ఇలా ఎక్కడ అవుతాయో అనే భయంతోనే బాబోరు వైసీపీ చేసే మంచికి బ్రేక్ వేస్తున్నారు అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. 

 

అంతేకాదు.. నెల్లూరు మొత్తం ఎవరు టీడీపీ కోసం పోటీ చేసేవారు కానీ.. టీడీపీ జండా మోసేవారు కానీ లేరు.. అలానే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా క్రమంగా టీడీపీ ఖాళీ అవుతూ వస్తుంది.. ఇప్పటికే 2024లో కూడా టీడీపీ ప్రతిపక్షం అని అంటున్నారు.. ఇంకా అప్పుడు కూడా ప్రతిపక్షం అవుతే 2026కి టీడీపీ జండా కూడా ఉండదు అని మరి కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరి చివరికి టీడీపీ పరిస్థితి ఎం అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: