ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొన్న శాసన మండలిలో అనుకోని విధంగా.... అనూహ్యంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాను ఎదుర్కొన్న లోటుని త్వరగా పుడ్చే పనిలో ఉన్న జగన్ ను చూసి చంద్రబాబు వణికే పరిస్థితి ఏర్పడింది. బాబు తన అనుభవంతో మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ఆపివేసినా సరే... జగన్ ఇప్పుడు దానికి ప్రతీకారంగా... రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఏకంగా శాసన మండలినే రద్దు చేసే పనిలో పడ్డాడు.

 

ఇప్పటికే మోడీ పైన కావలసిన ఒత్తిడిని తీసుకొని వచ్చిన జగన్ మోహన్ రెడ్డి తరువాత చంద్రబాబు పని పట్టబోతున్నాడు. ప్ర‌స్తుతం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 21 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. ఇక‌, మండ‌లిలో వారికి మాత్ర‌మే మెజారిటీ ఉంది. అలాంటి మండ‌లి ర‌ద్ద‌యితే.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించే హ‌క్కును కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇక చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు.

 

జగన్ పట్టుదల తెలిసిన వీరంతా బాబుని వీడి ఇలా తమకు ఎటువంటి స్కోప్ లేని నేపథ్యంలో వైసీపీ పార్టీని నమ్ముకొని తమ అడుగులు వేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే చాలా మంది నాయకులు వైసీపీ గూటికి చేరిన నేపథ్యంలో జగన్ ఇప్పుడు సమూలంగా తెలుగు దేశం పార్టీనే నాశనం చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాజ్యాంగానికి  మరియు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చిన జగన్ తన పై కుట్రలు జరిగితే చూసి ఊరుకునే స్థితిలో లేనట్లు తెలుస్తోంది. కాబట్టి ఇక బాబు శాసన మండలి రద్దు అయిన మరు క్షణమే మూట ముల్లే సర్డేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: