శాసనమండలిలో పై చేయి సాధించామనే విజయోత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే శాసనమండలి సభ్యుల వ్యవహారంపై ఆందోళన చెందుతోంది. కొద్ది రోజుల క్రితం మూడు రాజధానుల ఏర్పాటుపై శాసనమండలిలో టిడిపి వ్యతిరేకించడమే కాకుండా...మండలి చైర్మన్ ద్వారా ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి అప్పగించేలా రాజకీయం చేసింది. దీంతో జగన్ మూడు రాజధానుల ఆశలకు గండి పడింది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. తాము జగన్ ప్రభుత్వం పై విజయం సాధించామనే భావనతో టీడీపీ శ్రేణులు రాష్ట్రమంతా సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఆగ్రహం చెందిన జగన్ శాసన మండలి రద్దు చేయడమా లేక టిడిపి శాసన మండలి సభ్యులను తమ దారికి తెచ్చుకుని మండల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలా అనే ఆలోచనలో పడ్డారు. 

 

 దీంతో టీడీపీలో కలవరం మొదలయ్యింది. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు ఆకస్మాత్తుగా ఈరోజు టిడిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండలి రద్దు పై జరుగుతున్న ప్రచారం, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం పైన టీడీఎల్పీలో చర్చించబోతున్నారు. అయితే ఈ సమావేశానికి వివిధ కారణాలతో తాము హాజరు కావడం లేదంటూ ఓ నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు అధినేత కు సమాచారం అందించారు. సరస్వతి, తిప్పేస్వామి, కేఈ ప్రభాకర్, శత్రుచర్ల విజయరామరాజు, ఏ ఎస్ రామకృష్ణ తదితరులు టిడిపి సమావేశానికి గైర్హాజరు అయ్యారు. దీంతో ఒక్కసారిగా టిడిపిలో ఆందోళన మొదలైంది. నిన్నటి నుంచి టిడిపి ఎమ్మెల్సీలను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ పెద్దఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు అనే సమాచారం ఉండడంతో వీరంతా వైసిపి గేలానికి చిక్కారా అనే అనుమానాలు టిడిపిలో వ్యక్తమవుతున్నాయి.


 టిడిపికి మొత్తం తం 32 మంది ఎమ్మెల్సీల బలం ఉండగా ఇప్పటికే కొంతమంది దూరంగా ఉండి వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారని సంకేతాలను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు డుమ్మా కొట్టిన నలుగురు ఎమ్మెల్సీలు కూడా అనారోగ్యం కారణంగా సభకు హాజరు కావడం లేదు అంటూ వర్తమానం పంపారు. తాజాగా నలుగురు ఎమ్మెల్సీలు టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాకుండా ఉండడంపై టిడిపి ఆరా తీస్తోంది. ఈ నలుగురు కనుక వైసీపీ గూటికి వెళ్తే తాము ఇబ్బంది పడతామనే ఆందోళనలో ఆ పార్టీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: