మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా చిన్నారితో కలిసి పవన్ కళ్యాణ్ ఆడుకున్నారు. జై భారత్ మాతా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

భారతదేశం నుంచి పాకిస్తాన్ మత ప్రాదికన విడిపోయిందన్నారు. భారతదేశం హిందుత్వ దేశంగా కాకుండా సర్వమత సమ్మేళనానికి‌ నాందీగా నిలిచిందని చాటి చెప్పారు. తద్వారా దేశ ఔన్నత్యం దశ దిశలా వ్యాప్తిచెందిందని అన్నారు.  జెండాకు‌ వందనం చేయడంతో మన బాధ్యత తీరిపోదన్నారు. మన పూర్వీకుల త్యాగాలను అర్ధం చేసుకోవాలని పవన్ ఆకాంక్షించారు. మనం కూడా త్యాగాలకు‌ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.  భవిష్యత్తు తరాల కోసం పోరాడాలన్నారు.  హిందూయిజం అనేది మతం కాదు భారతీయమని స్పష్టం చేశారు.

ఎక్కడ అన్యాయం జరిగినా కులం, మతం‌ చూడకుండా ప్రశ్నించాలని సూచించారు. మన దేశం ఔన్నత్యాన్ని గుర్తించి.. సమాజానికి మంచి చేయాలని చెప్పారు. దేశ పౌరులందరూ బాధ్యతతో మెలగాలని పవన్ హితవు పలికారు. 
ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ ఇపుడు జగన్ ని ఢీ కొట్టేందుకు బీజేపీ అండ కోరుకున్నారు. మరి చిరంజీవిని కూడా ముగ్గులోకి లాగేందుకు తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని సమాచారం.

బీజేపీతో పొత్తు పెట్టుకుని తనను సవాల్ చేసిన పవన్ కి సరైన జవాబు చిరంజీవి ద్వారానే ఇప్పించాలని జగన్ ఆలోచన చేస్తున్నారని రాజకీయ పరిశీలకుల యోచన. అదే విధంగా పవన్ని పక్కన పెట్టుకున్న బీజేపీ పాచికలు కూడా పారకుండా ఈ ఎత్తుగడ ఉపయోగపడుతుందని వైసీపీ శిబిరం ఆలోచిస్తోందన్న చర్చ కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: