రాజకీయాలలో బంధాలకు, అనుబంధాలకు తావుండదనే విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఒకే ఫ్యామిలీకి చెందినవారు వేరు వేరు పార్టీల్లో ఉండటం, ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. 2009 లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన చిరంజీవి ఆ తరువాత కొన్ని కారణాల వలన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకుంటున్నారు. 
 
రాజకీయాల్లో చిరంజీవి అంతగా ప్రభావం చూపలేకపోయినా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. పరోక్షంగా టీడీపీకి ఎప్పుడూ మద్దతు తెలిపే జనసేన పార్టీ కొన్ని రోజుల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో మరియు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బీజేపీ జనసేన పార్టీలు కలిసి జగన్ ను ఢీ కొట్టాలని భావిస్తుంటే చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి పవన్ కు షాక్ ఇవ్వాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. 
 
సైరా సినిమా విడుదలైన తరువాత చిరంజీవి తన సతీమణితో జగన్ దంపతులను కలిసి సైరా సినిమా వీక్షించాలని కోరారు. జగన్ కూడా చిరంజీవితో సన్నిహితంగానే మెలుగుతున్నాడు. సీఎం జగన్ వైసీపీ పార్టీ ద్వారా చిరంజీవిని రాజకీయ తెరపైకి తీసుకొనిరావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ మార్చి నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చిరంజీవిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
చిరంజీవి కూడా జగన్ పాలనను పలు సందర్భాల్లో మెచ్చుకోవటంతో పాటు జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా కాపు సామాజికవర్గం మద్దతు కూడా వైసీపీ పార్టీకి వస్తుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: