పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో ఒక క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.. నేను ట్రెండ్ ను ఫాలౌ అవ్వను ట్రెండ్ ను సృష్టిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకు లను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనా లు పెరిగాయి. అందుకు పవన్ సినిమా లు ఎలా ఉన్న కూడా విడుదలైన మొదటిరోజే మంచి టాక్ ను అందుకుంటూ వస్తున్నాయి. 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమా లకు దూరం గా ఉంది రాజకీయా లకు దగ్గరగా ఉండటంతో జనాల్లో మరింత ఆకర్షణ పెరగడమే కాకుండా జనాల గుండెల్లో నిలుస్తూ వస్తున్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి లో పవన్ కళ్యాణ్  జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో పలువురు జనసేన లీడర్స్, పార్టీ నేతలు హాజరయ్యారు. 


ఈ సందర్బం గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతిఏడాది జెండాను ఎగురవేస్తే సరిపోదు.మత ప్రాతిపదికనే పాకిస్థాన్ విడిపోయిందని, పాక్ ముస్లిం దేశంగా మిగిలిపోగా, ఇండియా మాత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, సమాజాని కి మేలు చేసే పనులు చేయాలని పవన్ వ్యాఖ్యానించారు.


అంతే కాకుండా .. పూర్వీకుల త్యాగా లను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవా లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సందర్బంగా అన్నారు. ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని, భవిష్యత్ కోసం పోరాడా లని పిలుపునిచ్చారు. హిందూయిజం మతం కాదని, భారతీయతని ప్రతి ఒక్కరు గుర్తుంచు కోవాలని పవన కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ ఎప్పుడు మాట్లాడినా కూడా అది సంచలంగా మారుతుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: