తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతున్నది.  ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగలబోతుందా అంటే అవుననే అంటున్నారు.  రేపు ఆంధ్రప్రదేశ్ ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది.  రేపు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీ కాబోతున్నది.  కేబినెట్ లో శాసనమండలిపై చర్చించి రద్దు నిర్ణయం తీసుకుంటారు.  


దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపబోతున్నారు.  ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ షాక్ అయ్యింది.  అసెంబ్లీ మండలిపై నిర్ణయం తీసుకోవడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లు పాస్ కాకపోవడంతో వైకాపా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది.  ఇది ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.  ఎందుకంటే, ఇప్పుడు ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.  


అందుకే అలోచించి నిర్ణయం తీసుకోవాలి.  అంతేగాని, అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.  ఈరోజు తెలుగుదేశం పార్టీ టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  ఈ సమావేశంలో రేపు జరిగే అసెంబ్లీకి హాజరు కాకూడదు అని నిర్ణయం తీసుకున్నారు.  అంతేకాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను వైకాపా ప్రలోభపెట్టినట్టు చెప్తున్నారు.  


ప్రలోభానికి లోనుకాకపోవడంతో ఐదుకోట్ల రూపాయల వరకు డబ్బులు ఇచ్చేందుకు కూడా వైకాపా సిద్ధం అయినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.  ఈ ప్రలోభాలకు లొంగకపోవడంతో  వైకాపా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.  ఏదైతేనేం వైకాపా తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నది.  తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తెచ్చేలా ఉన్నది.  మరి ఇపుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటి అన్నది తెలియాలి. ఒకవేళ మండలి రద్దు చేస్తే అందరు టీడీపీ ని వదిలి వైకాపాలోకి వెళ్తారా చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: