రాజకీయాల్లో మహిళలని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వారు తలుచుకుంటే ఎలాంటి వారినైనా చిత్తు చేయగలరు. చిత్తు చేయడమే కాదు...భవిష్యత్‌లో ప్రత్యర్ధులకు రాజకీయ జీవితమే క్లోజ్ అయిపోయేలా చేయగల సత్తా వారికి ఉంది. అలా ఏపీలో ఓ యంగ్ లేడీ డైనమిక్ ఓ సీనియర్ నాయకుడు రాజకీయ చాప్టర్‌ని దాదాపు క్లోజ్ చేసింది. ఆ విధంగా సీనియర్ నాయకుడుకు భవిష్యత్ లేకుండా చేసిన డైనమిక్ లేడీ నేత ఎవరో కాదు...చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని. ఆ సీనియర్ నాయకుడు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

 

మామూలుగా పేటలో ప్రత్తిపాటికి తిరుగులేదు...ఆయన 1999, 2009, 2014 సం.ల్లో మూడు సార్లు పేట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2004లో కూడా కేవలం 200ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఇక 2014లో గెలిచి...బాబు కేబినెట్‌లో మంత్రి కూడా పని చేశారు. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజని, టీడీపీలో చేరి ప్రత్తిపాటికి బ్యాక్‌బోన్‌గా పని చేశారు. కానీ పార్టీలో ఆమెకు తగిన న్యాయం దొరకపోవడంతో ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.

 

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో రజని మీద నమ్మకంతో సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని సైతం పక్కనబెట్టి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఏ  మాత్రం వమ్ము చేయకుండా రజని కష్టపడి ప్రచారం చేసుకుంది. రాజకీయాలకి కొత్తైన కూడా సీనియర్ నేతకు ధీటుగా వ్యూహాలు రచిస్తూ....అందరినీ కలుపుని పార్టీ కోసం కష్టపడింది. ఆ కష్టం ఏ మాత్రం వృధా కాకుండా పాతిక సంవత్సరాలు పాటు పేటలో రాజకీయం చేస్తున్న ప్రత్తిపాటికి చెక్ పెట్టి, ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది.

 

ఇక తొలిసారి ఎమ్మెల్యేగా అయిన ఏ మాత్రం అనుభవం లేని విధంగా లేకుండా, ప్రజల కోసం పని చేస్తూ ముందుకెళుతున్నారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా కృషి చేస్తున్నారు. పుల్లారావు 25 ఏళ్లలో చేయలేని విధంగా రజని నియోజకవర్గం కోసం పని చేస్తున్నారు. వర్క్ పరంగానే కాకుండా, అటు రాజకీయ వ్యూహాల పరంగా కూడా ప్రత్తిపాటికి కంటే ముందున్నారు. రజని ఇలా దూసుకుపోతుంటే..పుల్లారావు పరిస్తితి అగమ్యగోచరంగా తయారైంది. వీటికి తోడు అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటం వల్ల ఆయన సి‌ఐ‌డి కేసులో కూడా చిక్కుకున్నారు. మొత్తానికి బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు విడ‌ద‌ల ర‌జ‌నీ...తొలిసారి పాలిటిక్స్‌లోకి వ‌చ్చినా.... త‌న దూకుడు, వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు, ఎత్తుడ‌గ‌ల‌తో లేడీ డైన‌మిక్‌గా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: