తెలంగాణ ప్రజలు, నాయకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన ఫలితాలు వచ్చేశాయ్. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మునుపెన్నడూ.. దేశంలో ఎక్కడ కుడా ఇలాంటి విజయం సాధించి ఉండరు. అలాంటి విజయాన్ని సొంతం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. రెండు జాతీయ పార్టీలు ఉన్న రెండు పార్టీలను అణగతొక్కి విజయం సాధించాడు కేసీఆర్. 

 

ఏ రాష్ట్రంలో చుసిన ప్రతిపక్షలు గోల గోల చేస్తుంటే ఇక్కడ అసలు ప్రతిపక్షాన్నే అంతం చేస్తున్నాడు సీఎం కేసీఆర్. ముండిగా ఉన్న ప్రజల మనసు గెలుచుకొని తెలంగాణను ముందడుగు వేయిస్తున్నాడు. నిజానికి ఈ గెలుపును టిఆర్ఎస్ పార్టీ కూడా ఉహించి ఉండదు.. అంతటి విజయాన్ని టిఆర్ఎస్ సాధించింది. 

 

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అధికార పార్టీ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇంత భారీ విజ‌యం బ‌హుశ దేశంలోని ఏరాష్ట్రంలోనూ ఏ పార్టీకి ద‌క్క‌లేద‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. అయితే ఫలితాలు ఏ ప్ర‌స్థానానికి దారితీస్తాయి? అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధం అయ్యింది. ఎందుకు అంటే.. సీఎం కేసీఆర్ గెలుపు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. 

 

ఈ ఫలితాలు వాళ్లలో అహాన్ని పెంచుతాయా? లేక ప్రజలకు మరింత సేవ చేస్తారా ? అనేది ప్రశ్నార్ధకమే. సాధించింది చూసుకొని ప్రజలకు సేవ చెయ్యడం మారుస్తారా? అని ప్రజలు కూడా ప్రశ్నించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి గెలుపు ఎవరికి సాధ్యం కాదు.. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సాధ్యం అయ్యింది. 

 

కాబట్టి.. ఈ విజయాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ‌ చెయ్యడానికి వినియోగిస్తే టిఆర్ఎస్ పార్టీ ఫలితాలలో ఎలా దేశంలో 1 ఉందొ..అలానే  తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1స్థానంలో ఉంటుంది. తెలంగాణను మంచి అభివృద్ధి చేయ‌వ‌చ్చు.. లేదు మాకు తిరుగు లేద‌ అనుకుంటే నియంతృత్వానికి దారి తీసే ఛాన్స్ ఉంద‌ని మేథావులు అంటున్నారు. మరి చివరికి తెలంగాణ పరిస్థితి ఎం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: