నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో దూసుకుపోయింది. అన్ని ఎన్నికల లాగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది టిఆర్ఎస్ పార్టీ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ సత్తాచాటినప్పటికీ అక్కడక్కడ టిఆర్ఎస్ పార్టీ కూడా సరైన మెజారిటీ సాధించలేకపోయింది. అటు కార్పొరేషన్లలో కూడా తక్కువ ఓటింగ్ నమోదవడంతో... కార్పొరేషన్ లలో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి తెలంగాణలో. 

 

 

 ఇతర పార్టీల నేతలను... ఆకర్షించి ఎలాగైనా పార్టీలో చేర్చుకొని  కార్పొరేషన్లు దక్కించుకోవాలని టిఆర్ఎస్ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడానికి మిగతా పార్టీలు కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కార్పొరేషన్ రాజకీయాలని క్యాంపుల వద్దకు చేరుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల అందరిని .. ఇప్పటికే ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి. రామగుండం కార్పోరేషన్ రాజకీయాలు అయితే మరింత హీటెక్కాయి . కార్పొరేషన్ను దక్కించుకునేందుకు టిఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

 

 

 ఇప్పటికే 9మంది ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల మద్దతును టిఆర్ఎస్ పార్టీ కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా ముందు జాగ్రత్తతో టిఆర్ఎస్ నేతలు క్యాంపు కు తరలించారు. అంతే కాదు బిజేపి పార్టీ నుంచి గెలిచిన వారిని కూడా తమ పార్టీలోకి లాగటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నది అధికార టీఆర్ఎస్ పార్టీ.కమలనాథులకు  కి షాక్ ఇచ్చి  కార్పొరేషన్ సొంతం చేసుకోవడానికి టిఆర్ఎస్ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అనుకున్న కార్పొరేషన్ లోని మొత్తం 50 డివిజన్ లో 18 మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది... కాంగ్రెస్ పార్టీ 11 ఫార్వర్డ్ బ్లాక్ 9 బిజెపి 6, ఇండిపెండెంట్లు ఆరుగురు విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: