మేకతోటి సుచరిత....ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి. సాధారణ నాయకురాలుగా రాజకీయాన్ని మొదలుపెట్టిన సుచరిత హోమ్ మంత్రి అనే పదవి తన పేరు ముందు వచ్చేందుకు చాలా కష్టపడ్డారు. అందరి నాయకుల మాదిరిగా అటు ఇటు జంప్‌లు కొట్టకుండా, ఒకే ఒక వైఎస్ ఫ్యామిలీని నమ్ముకుని అంచెలెంచాలుగా ఎదుగుతూ వచ్చారు. మొదట కాంగ్రెస్‌లో సాధారణ నాయకురాలుగా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన సుచరితకు....దివంగత వైఎస్సార్ 2009 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు.

 

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సుచరిత...2009 ఎన్నికల్లో ఇటు టీడీపీ, అటు ప్రజారాజ్యం అభ్యర్ధులని చిత్తు చేసి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత కొన్ని రోజులకి వైఎస్సార్ మరణించడం, జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు పాల్పడటంతో సుచరిత...జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఏ మాత్రం పదవి కోసం, అధికారం కోసం ఆశపడకుండా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, వైసీపీలోకి వచ్చారు. అదే సమయంలో అనేక కష్టాలు పడ్డ జగన్‌ని మాత్రం వదల్లేదు.

 

ఇక అప్పుడే ఉపఎన్నికలు రావడంతో మరోసారి బరిలో దిగారు. 2012లో జరిగిన ప్రత్తిపాడు ఉపఎన్నికల్లో భారీ విజయం దక్కించుకుని సత్తా చాటారు. తర్వాత రాష్ట్రం విడిపోవడం, పరిస్థితులు మారడంతో 2014లో అదే ప్రత్తిపాడు నుంచి ఓటమి పాలయ్యారు. అయిన సరే అధికారం కోసం ఇతర నేతల మాదిరిగా జగన్‌ని వదిలి వెళ్లిపోలేదు. ఎన్ని కష్టాలు ఎదురైన వైసీపీలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి మూడోసారి విజయం సాధించారు. ఇక నమ్ముకుని వారికి జగన్ ఎప్పుడు అన్యాయం చేయరనే సూత్రాన్ని నిజం చేస్తూ...సుచరితకు హోమ్ మంత్రి పదవి ఇచ్చారు.

 

మంత్రి పదవి దక్కిన ఏ మాత్రం పొంగిపోకుండా, సాధారణంగానే నడుచుకుంటూ, తన బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అలాగే స‌మ‌యానుకూలంగా మాట‌ల యుద్ధం చేయ‌డంలో ఆమె.. త‌న‌కు తానే సాటిగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు దూరంగా ఉంటూనే త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. విప‌క్షాల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా కౌంట‌ర్లు ఇస్తున్నారు. మొత్తానికి అంచెలెంచాలుగా ఎదుగుతూ వచ్చిన...సుచరిత ఇప్పుడు హోమ్ మంత్రిగా సత్తా చాటుతున్న లేడీ డైనమిక్ లీడర్‌గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: