అవును.. నిజమే..  ప్రజల నాడి కేసీఆర్ పట్టేశాడు.. టీఆర్ఎస్ హ‌వా ముందు కాంగ్రెస్‌, బీజేపీ స‌హా ఇత‌ర ప‌క్షాలు ఘోరాతి ఘోరంగా ఓట‌మి పాల‌య్యాయి. ఒక్క ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కాదు 2018 ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ హవానే కొనసాగింది.. ఆ 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క బీజేపీ తప్ప మిగితా అన్ని పార్టీలు కలిసిపోయి మరి పోటీ చేశాయి. కానీ ఘోరంగా ఓడిపోయారు తప్ప ఫలితం లేకపోయే. 

 

అయితే, అస‌లు ఏం జ‌రిగింది? నిజానికి తెలంగాణ రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అంటే 2018 డిసెంబ‌రులో ఇచ్చిన హామీల‌నే కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ అమ‌లు చేయ‌లేదు. వీటినే ప్ర‌తిప‌క్షా పార్టీలు అన్ని ఎన్నిక‌ల్లో ప్ర‌చారాస్త్రాలుగా  చేసుకున్నాయి. అయినా కూడా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోలేక చ‌తికిల ప‌డ్డాయి. 

 

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నాడిని ఎందుకు ప‌ట్ట‌లేక పోయాయ‌నే సందేహం తెర‌మీదికి వ‌స్తోంది. అయితే.. నిజానికి.. తెలంగాణలో ఒక్క టిఆర్ఎస్ పార్టీలో తప్ప మారే పార్టీలోనూ సరైన నాయకుడు లేడు.. ఒకవేళ టిఆర్ఎస్ ని కాకుండా మరో పార్టీని గెలిపించిన సరే.. రాజకీయం వేడెక్కుతుంది.. 

 

ఎందుకంటే.. ఆ పార్టీ నేతలే నేనంటే నేను అని పోటీ పడుతారు.. వాళ్లలో వాళ్ళకే కన్ఫ్యూషన్.. లీడర్ ఎవరు? అని. అలాంటి పార్టీని గెలిపించుకొని ఇబ్బంది పడేకంటే ఒకే నాయకుడు ఉన్న పార్టీ బెటర్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇలా మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పార్టీలకు ఓటు వేసిన వేస్ట్.. ఎందుకంటే విల్లు ఆయుధాలుగా మార్చుకున్న అమలు కానీ హామీలు అన్ని మళ్ళి ఎన్నికలు వచ్చేసరికి అమలు అవుతాయి.. ఇప్పుడు వీళ్లకు ఓటు వేసిన వేస్ట్ అని మరికొందరు ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ప్రజల నాడి ఎంత పట్టుకోవాలి అని చుసిన ఆ నాయకులకు దొరకడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: