ఆర్‌.కె. రోజా ద‌గ్గ‌ర నుంచి నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా వ‌ర‌కు ఎదిగిన ఈమె గురించి తెలియ‌ని వారుండ‌రు. సినిమాల్లో హీరోయిన్‌గా పీక్  స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. అంతేకాదు టీడీపీ మహిళ అధ్యక్షురాలిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. తెలుగు దేశం  ప్రతిపక్షంలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీపై రోజా ఓ రేంజ్‌లోనే పోరాటాలు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. అందుకు కారణం 2009లో.. టీడీపీ, 2014లో.. వైసీపీ ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ఓటమి పాలవ్వడమే.

 

ఆ తర్వాత రోజా..వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయింది. అంతేకాదు వై.యస్.జగన్‌కు  రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది. ఈ క్ర‌మంలోనే బలమైన వాయిస్‌తో అంద‌రికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేది. ఇక 2019లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేసింది. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఐర‌న్ లెగ్ అని పేరు అనిపించుకున్నా.. త‌ర్వాత పుంజుకుని దూకుడు రాజ‌కీయాలు చేస్తున్నారు రోజా. ఇక‌ 2014 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా... 2019 ఫలితాల్లోనూ విజయం దిశగా అడుగులు వేశారు.

 

ఈ ఎన్నికల్లో రోజా..2వేలకు పైగా స్వల్ప ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్ధిపై గెలిచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో పాటు రోజాకు జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్‌లో మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాని అది జ‌ర‌గ‌లేదు. ఇక‌ ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి అంటూ ఏమీ లేక‌పోయినా.. కీల‌క రాజ‌కీయాలు మాత్రం చేస్తున్నారు. ప్ర‌తిప‌క్షానికి స‌వాళ్లు రువ్వుతూ ఓ ఆట ఆడిస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. స‌వాళ్ల‌పై స‌వాళ్లు.. వ్యూహాల‌పై వ్యూహాలు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: