తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని కమలనాథులు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణలో ప్రచారం నిర్వహించి ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి అని చేయని ప్రయత్నం లేదు. కానీ ఒక పార్లమెంట్ ఎలక్షన్ మినహా మిగతా అన్ని ఎలక్షన్లలో... బిజెపి పార్టీకి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ కమలం పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో  పాగా వేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఆలోచన బాగానే ఉన్నప్పటికీ పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా పార్టీ ప్రజల్లోకి వెళ్లలేక పోతుంది. దానికి మించి టిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఎంతో  సానుకూలత ఉండడంతో... బిజెపికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం మరింత కష్టం గా మారిపోయింది. 

 

 

 ఇక తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బిజెపి మరోసారి ఘోర పరాజయం పాలైంది. అయితే మున్సిపల్ ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ కిషన్ రెడ్డిలు అభ్యర్థుల తరపున భారీగానే ప్రచారం చేశారు. ముఖ్యంగా అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కానీ బిజెపి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కమలనాథులకు విజయం మాత్రం వరించలేకపోయింది. సినిమా  భాషలో చెప్పాలంటే.. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీది డిజాస్టర్ షో గా  మారిపోయింది. 

 

 

 అయితే బిజెపి ఘోరపరాజయం వెనుక.. పార్టీ నేతల సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. కమలం పార్టీలో నాయకులకు వాళ్లకు వాళ్ళకే పడడం లేదని సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో  కిషన్ రెడ్డి లక్ష్మణ్ పుంజుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. అటు తెలంగాణలో బీజేపీ పెద్దలైన  కిషన్ రెడ్డి లక్ష్మణ్ లు కూడా బిజెపి నేతలను ఒక్కతాటిపై నడిపించలేక పోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.అయితే వచ్చే ఎన్నికల్లో తమదే ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కమలనాథులకు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చెంప పెట్టువంటివని పలువురు అంటున్నారు. మరి పార్టీ ఇంత దిగజారి పోవడానికి కారణం... పార్టీ నాయకుల్లో అంతర్గత కుమ్ములాటలు... పార్టీని సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం.. అంతకుమించి ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తున్న వ్యూహాలు ఇందుకు కారణమని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: