తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక అన్ని ఎన్నికల్లో విజయఢంకా మోగించినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లో అసామాన్య విజయాన్ని సొంతం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. చరిత్రలో నిలిచిపోయేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ జోరు చూపించగా  కారు వంద స్పీడులో దూసుకుపోయింది. అయితే ఇప్పటి వరకు జరిగే ఎన్నికలు అని కెసిఆర్ నాయకత్వంలోనే జరిగాగ...  ఇక తాజాగా కెసిఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.

 

 

 దీంతో ఈ ఎన్నికల విజయం టీఆర్ఎస్ పార్టీకి మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇకపోతే  టిఆర్ఎస్ లోని ముఖ్య నేతలందరూ యువ నాయకత్వం వైపు ఎదురు చూస్తున్నట్లుగా పలుమార్లు ఇండైరెక్ట్గా కూడా చెప్పారు. ఇక అటు రాష్ట్రం కూడా యువ నాయకత్వం వైపే ఎదురుచూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కేటీఆర్ సీఎం కాబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు నాయకత్వం వహించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కేటీఆర్ శకం తెలంగాణ రాజకీయాల్లో మొదలైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

 

 ఈ క్రమంలో కేటీఆర్ అభిమానులందరూ ఆనందంలో మునిగిపోయారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సీఎం సీటు వరకు  ఎదుగుతారు అంటూ కేటీఆర్ అభిమానులు మురిసిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ నాయకత్వంలో పార్టీ విజయం సాధించడంతో... కేటీఆర్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని  స్పష్టంగా అర్థం అయిందని టిఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో  కేటీఆర్ కోటరీ  స్టార్ట్ అయిందని.. సీఎం సీటు అధిష్టించడం ఒక్కటే ఆలస్యం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు టిఆర్ఎస్ శ్రేణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: