తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో  టిఆర్ఎస్ పార్టీ అప్రతిహత విజయం సాధించిన విషయం తెలిసిందే. చరిత్రలో నిలిచిపోయేలా మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలన్నీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ నాయకత్వం వల్ల విజయం సాధించామని... యువ నాయకత్వం లో విజయవంతంగా ముందుకు సాగాము అంటూ తెలంగాణ  రాజకీయాల్లో  అనుకుంటున్నారు. అయితే కేటీఆర్ యువ నాయకత్వం పార్టీకి కాస్త ప్లస్ అయింది అనడం వరకు ఓకే కానీ... పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల్లో తనదైన వ్యూహాలతో ముందుకు సాగి ఏకంగా కాంగ్రెస్ కంచుకోట అయిన సంగారెడ్డిలో టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేశారు. మరోసారి హరీష్ రావు కాలు పెడితే అపజయమే ఉండదు అని నిరూపించారు హరీష్ రావు. 

 

 

 కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం హరీష్ ఊసు ఎక్కడా వినిపించడం లేదు. టిఆర్ఎస్ పార్టీ లో హరీశ్ ప్రస్తావనను కాస్త దూరంగానే ఉంచుతున్నారు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు టిఆర్ఎస్ ఎన్ని విజయాలు సాధించిన.. హరీష్ రావు పేరు ముందుగా వినిపించేది. ఎందుకంటే పార్టీ నేతలను సమన్వయం చేస్తూ... తనదైనా వ్యూహాలతో టీఆర్ఎస్ పార్టీకి అలుపెరుగని సేవ చేశారు మంత్రి హరీష్ రావు. అయితే హరీష్ రావు పార్టీకి ఎంత సేవ చేసినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం గత కొంతకాలంగా హరీష్ రావు ను పక్కన పెడుతూ వస్తుంది అని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే హరీష్ రావును పార్టీ పట్టించుకోవడం లేదంటూ ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ ఖండిస్తూ తానెప్పుడూ కేసీఆర్ విధేయుడుని  అంటూ హరీష్ రావు ఎన్నోసార్లు స్పష్టం చేశారు కూడా. 

 

 

 ఇకపోతే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో హరీష్ రావు  తనదైన వ్యూహాలతో ముందుకు సాగి ఘన విజయాన్ని సాధించినప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు గురించి ఎక్కడా ప్రస్తావన మాత్రం రావడం లేదు. హరీష్ రావు విజయం సాధించాకే ప్రస్తావన రాకపోతే ఇక రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉనికి  ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న. అయితే అటు హరీష్ రావు మాత్రం కెసిఆర్ కు విధేయుడు అని... కెసిఆర్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తానని చెబుతున్నారు. ఇటేమో హరీష్ రావు ప్రస్తావన ఎక్కడ రాకుండా టిఆర్ఎస్ పార్టీ.. కాస్త దూరంగానే ఉంచుతోంది అన్న విషయం తెలిసిందే. మరి భవిష్యత్తులో హరీష్ రావు ఉనికి  ఏమిటో అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: