ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్టీ కోటాలో అత్యంత చిన్న వయస్సులోనే పుష్ప శ్రీవాణికి మంత్రి పదవి దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జన్మించిన పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుంది. 
 
జంగారెడ్డి గూడెం సూర్య కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన పుష్ప శ్రీవాణి అక్కడే ఉమెన్స్ కళాశాలలో 'డిగ్రీ పూర్తి చేసింది. విశాఖలో బీఈడీ పూర్తి చేసిన పుష్ప శ్రీవాణి ఏడాదిన్నరపాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన పుష్ప శ్రీవాణికి కురుపాం రాజవంశీకులు అయిన శత్రుచర్ల కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆ విధంగా పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లాకు కోడలు అయింది. 
 
సాధారణ గృహిణిగా, ఉపధ్యాయ వృత్తితో జీవనం కొనసాగిస్తున్న పుష్ప శ్రీవాణి భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. 2014లో వైసీపీ పార్టీ తరపున కురుపాం నియోజకవర్గం నుండి పోటీ చేసిన పుష్ప శ్రీవాణి 19,083 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై 26,602 ఓట్ల మెజారిటీతో పుష్ప శ్రీవాణి గెలిచింది. 2019, జూన్ 8వ తేదీన సీఎం జగన్ మంత్రి వర్గంలో పుష్ప శ్రీవాణికి చోటు దక్కింది. 
 
సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పుష్ప శ్రీ వాణి తనకు కేటాయించిన శాఖలో దూసుకుపోతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుండి ఎవరైనా విమర్శలు చేస్తే పుష్ప శ్రీవాణి తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో పుష్ప శ్రీవాణి ఒక చిన్న సినిమాలో కీలక పాత్రలో నటించారు. అమృత భూమి అనే సినిమాలో టీచర్ పాత్రలో పుష్ప శ్రీవాణి నటించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: