తెలంగాణ మున్సిపాల్టి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకే షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి. అంతటి భారీ విజయం సాధించింది టిఆర్ఎస్ పార్టీ. అంతటి భారీ విజయాన్ని దేశంలో టిఆర్ఎస్ తప్ప ఇంతవరుకు మారె పార్టీ సొంతం చేసుకోలేదు అని సీఎం కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

   

తెలంగాణాలో ఉన్న రెండు జాతీయ పార్టీలను దారుణంగా అణగదొక్కేశాడు కేసీఆర్. రెండు జాతీయ పార్టీ నాయకులంతా ఒక వైపు ఉంటె టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక వైపు ఉండి భారీ విజయాన్ని సాధించాడు. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫలితాలు చుసిన వారు ఆంధ్రాలోనూ అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది అని అంటున్నారు..   

    

అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు తాజాగా వ‌చ్చిన తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ప్ర‌తిఫ‌లిస్తాయా ?  ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారంలో ఉన్న నాయ‌కులు కాన్‌స్టంట్‌గా ప‌నిచేసుకుని పోతుండ‌గా.. నిర‌ర్ధ‌క వాద‌న‌ల‌తో విప‌క్షాలు చేసిన దాడుల‌ను ప్ర‌జ‌లు తెలంగాణ‌లో ప‌ట్టించుకోలేదు. 

    

ఈ ప‌రిస్థితి ఏపీలోనూ త‌లెత్తుతుంద‌ని అంటున్నారు. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న ప‌నితాను చేసుకుని పోతోంది. అయినా విప‌క్షాలు ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ‌లో ఏర్ప‌డిన ప‌రిస్థితి ఏపీలోనూ ఏర్ప‌డితే..? అనే చ‌ర్చ ఆసక్తిగా మారింది. మరి ఏపీలోనూ ఇదే ఫలితాలు వస్తాయా? 

    

వస్తాయా అంటే? వస్తాయి అనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ఆంధ్రలో ప్రతిపక్షం అయినా టీడీపీ పై ఎప్పుడో నమ్మకాలూ పోయాయి అని.. కేవలం ఇప్పుడు వైసీపీ వారు మాత్రమే ఇక్కడ టిఆర్ఎస్ ఉన్నట్టు అక్కడ వైసీపీ ఉంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: