రాజకీయాల్లో నిస్వార్ధంగా కష్టపడితే విజయం త్వరగానే వస్తుందనే దానికి ఉదాహరణగా వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నిలుస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీలో ఎస్సీ సామాజికవర్గంలో కీలక నాయకురులుగా ఉన్న పద్మావతి....వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయురాలు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన పద్మావతి...ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నుంచి వైసీపీ తరుపున బరిలో దిగారు.

 

అయితే కొంత అనుకూల పవనాలు టీడీపీకి ఉండటం వల్ల...కేవలం 4 వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి యామిని బాల చేతిలో ఓడిపోయారు. ఇక ఓడిపోయాం, అధికారం లేదు కదా అని విశ్రమించలేదు. పార్టీ మారలేదు. ఒకే ఒక్క జగన్ నాయకత్వాన్ని నమ్మి ప్రతిపక్షంలో ఉండే పోరాటం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారో లేదో తెలియదు గానీ...పద్మావతి మాత్రం ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు.

 

టీడీపీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పాలనపై పొరాడి...ప్రజలకు అండగా నిలిచారు. ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఇక అప్పుడు వరకు పోరాటం చేసిన ఫలితంగా పద్మావతికే జగన్ మళ్ళీ టికెట్ ఇచ్చారు. అటు టీడీపీ ఎమ్మెల్యేపై ప్రజావ్యతిరేకిత పెరిగిపోవడంతో చంద్రబాబు...యామిని బాలని పక్కనబెట్టి బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. అయితే అభ్యర్ధిని మార్చిన శింగనమల ప్రజలు పద్మావతిని వదల్లేదు. ఊహించని విధంగా 46 వేలపైనే మెజారిటీతో గెలిపించుకున్నారు.

 

ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన పద్మావతి ప్రజల కోసం ఇంకా మరింత కష్టపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి చేస్తూనే, సంక్షేమ పథకాలని ప్రజలకు అందేలా చేస్తున్నారు. అటు నియోజకవర్గంలోనే కాకుండా....ఇటు అసెంబ్లీలో కూడా పద్మావతి తనదైన శైలిలో మాట్లాడుతూ...ప్రతిపక్షంపై సెటైర్లు వేస్తున్నారు. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన, మంచి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నారు. అలాగే ప్రభుత్వానికి మద్ధతుగా నిలబడుతూ, ప్రతిపక్షానికి చెక్ పెడుతున్నారు. మొత్తంగా వైసీపీలో ప‌ద్మావ‌తి స్టైల్ డిఫ‌రెంట్ అనే పేరు తెచ్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: