శత్రువుకు శత్రువు మిత్రుడు.. ఇప్పుడు ఇదే పాలసీని మీడియా సంస్థలు కూడా పాటిస్తున్నాయి. ఏపీలో కొరకరాని కొయ్యగా మారిన వైసీపీ అధినేత జగన్ ను పాపం.. చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమితో జగన్ చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. రాజధాని భూముల్లో టీడీపీ నేతల అక్రమాలంటూ అన్నీ తవ్వి తీస్తున్నాడు. చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాల బాగోతాలన్నీ బయటపెడతానంటున్నాడు.

 

పాపం.. తాము సపోర్ట్ చేసే నాయకుడు ఇలా జగన్ చేతిలో బుక్ కావడం చూసి అనుకూల మీడియా సంస్థల అధినేతల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రత్యేకించి సీబీఎన్ చంద్రజ్యోతి ఆర్కే సంగతి తెలుసు కదా. తమ బాస్ కు ఎలా సాయం చేయాలో తెలియక తెగ ఇబ్బంది పడుతున్నారు. రోజూ చంద్రడబ్బాతో తమ మీడియాను మోతెక్కిస్తున్నా.. పెద్దగా ఫలితం ఉండటం లేదు. అందుకే ఇప్పుడు జగన్ ను ఏమీ చేయలేమని తెలుసుకున్న ఎల్లో పెద్దలు.. ఇప్పుడు ఢిల్లీ పెద్దలను రెచ్చగొట్టే పనిలో పడ్డారు.

 

సీబీఎన్ ఆర్కే చంద్రజ్యోతి తాజా రాతలు ఇదే సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అమరావతి కలిసివచ్చే అంశమట. అమరావతి తరలింపును బీజేపీ అడ్డుకోగలిగితే ఆ పార్టీకి ప్రజల ఆదరణ లభిస్తుందట. రాజధాని రైతులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల వారు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బీజేపీ పెద్దలు కట్టడి చేయాలని ఆశిస్తున్నారట. అంటే వీరి మనసులో కోరికలన్నీ.. ఇలా జనం పేరుతో చెప్పేస్తుంటారన్నమాట.

 

అంతేకాదు.. బీజేపీ నాయకులు ఈ దిశగా నిర్దుష్ట కార్యాచరణ ప్రకటించకపోవడం పట్ల ప్రజలు నిరాశ చెందారట.. ఇక్కడ ప్రజలు అంటే సీబీఎన్, అండ్ సీబీఎన్ ఆర్కే చంద్రజ్యోతి అన్నమాట. ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అక్కడ బీజేపీ పెద్దలతో ఏమి మాట్లాడారో తెలియదు.. మొత్తం మీద అందివచ్చిన అవకాశాన్నిబీజేపీ నాయకులు చేజార్చుకుంటున్నారన్న భావన మాత్రం రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించిందట. అంటే జగన్ ను దెబ్బ కొట్టకపోతే ఈ బీజేపీ కూడా పరమ వేస్ట్ అన్నమాట.. అంతేగా.. అంతేగా.. అహో.. సీబీఎన్ ఆర్కే.. ఏమీ మీ రాత. అదిరిందిగా..!

మరింత సమాచారం తెలుసుకోండి: