సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా యంగ్ హీరోలు రాజకీయాల వైపు చూడడం మాత్రం ఒక సంచలనమే. అయితే సినీ ఇంద్రీకి చెందిన వారు తమ సినీ అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో మాత్రం రాజకీయాల వైపు తొంగి చూస్తుంటారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ నటిస్తూ రెబల్ స్టార్ కృష్ణంరాజు యాక్టివ్ రోల్ పోషించారు. గతంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లడం అక్కడ ఓటమి చెందడంతో బీజేపీ లో కృష్ణం రాజు ప్రాధాన్యం తగ్గింది. అయితే మళ్ళీ ఆ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు కృష్ణం రాజు ప్రయత్నిస్తున్నారు. 


బీజేపీ ప్రభుత్వం తనకు గవర్నర్ పదవి ఇస్తుందని కూడా ఆశించారు కానీ ఆ అవకాశం ఆయనకు దక్కలేదు. ఈ సంగతి ఇలా ఉంటే... గత కొంతకాలంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర బిజెపి పెద్దలతో తిరుగుతూ,  పార్టీ నియమాలను సైతం పక్కన పెట్టి వారితో మంతనాలు చేస్తుండడం వైసిపి అధినేత జగన్ కు తీవ్ర ఆగ్రహం  తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. తాజాగా కృష్ణంరాజు, రఘురామకృష్ణంరాజు ఇద్దరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. 


అసలు ఈ ముగ్గురు కలిసి ఏ విషయంపై ఇంత సుదీర్ఘంగా మాట్లాడుకున్నారా అనేది ఎవరికీ తెలియడంలేదు. దీనిపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే జనవరి 20వ తేదీన కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా కొంతమంది బిజెపి నాయకులకు ఆయన విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రభాస్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తో పాటు అనేక మంది బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు ప్రభాస్ ను వారందరికీ పరిచయం చేసి అనేక విషయాల గురించి చర్చించారట. 


అయితే కృష్ణంరాజు రఘురామ కృష్ణంరాజు ప్రభాస్ మాత్రం ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో మాట్లాడుకున్నట్టు ... ఏపీ రాజకీయల గురించి ప్రభాస్ ఆసక్తిగా రఘురామకృష్ణం రాజుతో మాట్లాడినట్టు సమాచారం. కొంపతీసి ఈ బాహుబలి రాజకీయాల మీద కన్నెయ్యలేదు కదా ...అంటూ కొంతమంది సెటైర్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: