శాసనమండలి రద్దు ప్రతిపాదనపై రాజకీయాపార్టీలతో పాటు జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన రెండు బిల్లులను  ఉద్దేశ్యపూర్వకంగా  తెలుగుదేశంపార్టీ అడ్డకోవటంతోనే కంపు మొదలైంది.  బిల్లులను ఆమోదించటమే లేకపోతే ఓడించటమన్నది సహజ ప్రక్రియ. కానీ నిబంధనలు విరుద్ధంగ సెలక్ట్ కమిటి పరిశీలను పంపుతున్నట్లు ఛైర్మన్ ను మ్యానేజ్ చేసిన విషయం బయటపడటంతోనే అధికారపార్టీకి మండిపోయింది.

 

ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ మాట్లాడుతూ శాసనమండలి రద్దు విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఎప్పుడైతే స్వయంగా జగనే మండలి అవసరం లేదని మాట్లాడారో వెంటనే  మంత్రులు, ఎంఎల్ఏలు కూడా మండలిని రద్దు చేయటానికే మద్దతుగా మాట్లాడారు. దాంతో  తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీల్లో కలకలం మొదలైంది. మండలి రద్దుకు వ్యతిరేకంగా  చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడుతో కలిసి ఎల్లోమీడియా మాట్లాడుతున్నదంతా భయంతోనే అని అర్ధమైపోతోంది.

 

సరే మండలి రద్దవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే నిజంగానే రద్దయితే నష్టపోయేదెవరు ? ఎవరంటే ముందు చంద్రబాబే అన్న విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. ఎలాగంటే టిడిపికి ఉన్న 34 మంది సభ్యులు ఒక్కసారిగా సభ్యత్వాలు కోల్పోతారు. అంటే అసెంబ్లీలోను చంద్రబాబు బలం పడిపోయి అటు కౌన్సిల్ కూడా రద్దయితే చంద్రబాబు రోధన అరణ్య రోధనగానే  మిగిలిపోవటం ఖాయం.

 

ప్రస్తుతం టిడిపి ఎంఎల్సీల్లో 15 మంది పదవీకాలం వచ్చే ఏడాది జూన్ లోపు అయిపోతుంది.  మరో 12 మంది 2023 మార్చి-జూన్ మధ్య ముగుస్తుంది. వీరిలో నారా లోకేష్ కూడా ఉన్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ బాబుతో పాటు మరో ముగ్గురికి  మాత్రం 2025 మార్చి వరకూ పదవీకాలం ఉంటుంది.

 

ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. పోతుల సునీత వైసిపిలో చేరిపోయారు.  ఇక వైసిపి విషయం చూస్తే ఉన్న తొమ్మిది మందిని జగన్ ఏదో ఓ రకంగా అకామిడేట్ చేస్తారు. కాబట్టి పెద్దగ నష్టం లేదు. టిడిపితో పాటు బిజెపి, పిడిఎఫ్, ఇండిపెండెంట్లు నష్టపోతారు. అంటే గట్టిగా చూస్తే  మండలి రద్దువల్ల ఎక్కువగా నష్టపోయేది చంద్రబాబు అయితే మండలి కంటిన్యు అయితే లాభపడేది జగన్. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: