జగన్మోహన్ రెడ్డి నుండి చంద్రబాబునాయుడు  రిటర్న్ గిఫ్ట్ తీసుకోక తప్పదా ? మొన్నటి ఎన్నికల్లో కేసియార్ నుండి చంద్రబాబు అందుకున్నారు. సోమవారం జగన్ నుండి అందుకునేట్లే ఉన్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి.  అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు  పాలనా వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు శాసనమండలిలో కంపయిపోయింది.

 

రెండు రోజుల పాటు మండలి  అట్టే పెట్టుకున్న రెండు బిల్లులను తెలుగుదేశంపార్టీ ఎంత కంపు చేయాలో అంతా చేసింది. బిల్లులను ఆమోదించాలి లేకపోతే  ఓడగొట్టాలి. కానీ టిడిపి మాత్రం మండలి ఛైర్మన్ మ్యానేజ్ చేసుకుని చివరకు సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించేట్లు చేసింది. ఆ తర్వాత వెంటనే మండలిని ఛైర్మన్ ఎంఏ షరీఫ్ నిరవధిక వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు.

 

రెండు రోజుల పాటు మండలిలో జరిగిన గొడవలో టిడిపి శాడిజం బయటపడింది. అసెంబ్లీలో తమకున్న బలంతో  వైసిపి బిల్లులను ఆమోదింపచేసుకుంటోంది. దాన్ని తట్టుకోలేని చంద్రబాబు తమకున్న మెజారిటితో  శాసనమండలిలో ఓడగొట్టిస్తున్నారు. మొన్నటి రెండు రోజుల గొడవ కూడా ఇందులో భాగమని అందరికీ తెలిసిందే. జగన్ పై తాము అద్భుతమైన విజయం సాధించినట్లు చంద్రబాబు అండ్ కో స్వీట్లు పంచుకున్నారు.

 

దాంతో ఒళ్ళుమండిపోయిన జగన్  అసలు శాసనమండలి ఉనికినే లేకుండా చేస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నారు. అందుకనే మండలిని రద్దు చేసేయాలని డిసైడ్ అయ్యారు.  దాంతో ఒక్కసారిగా టిడిపిలో కలకలం  మొదలైంది. నిజానికి మండలిలో బిల్లులను ఓడించినా లేకపోతే  సెలక్ట్ కమిటికి పంపినా బిల్లులు మహా అయితే ఓ నాలుగు నెలలు ఆగుతాయేమో అంతే.

 

నాలుగు మాసాల తర్వాత మళ్ళీ అవే బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంది చట్టమైపోతాయి. ఇంత దానికి మరీ చవకబారుగా ప్రవర్తించిన టిడిపికి అసలు మండలి రద్దు ప్రతిపాదనను జీర్ణించుకలేకపోతోంది. మొత్తానికి సోమవారం మండలి భవిష్యత్తు తేలిపోవటం ఖాయం. చూడబోతే చంద్రబాబుకు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఖాయమనే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: