పాపం.. చంద్రబాబు అండ్ ఆయన అనుకూల పచ్చ మీడియాకు ఇప్పుడు జగన్ ను చూస్తుంటే.. తలుపులు మూసిన గదిలో ముంతపొగ పెట్టినట్టుంది.. ఒంటికి కారాలు మిరియాలూ రాసుకున్నట్టు ఉంది.. అందుకే జగన్ ను ఏమీ చేయలేక.. తమ ప్రతాపమంతా రాతల్లో చూపుతున్నారు.. చంద్రబాబు కంటే జగన్ పై ఎక్కువగా రగిలిపోతున్న సీబీఎన్ ఆర్కే. ఆయన తన తాజా వ్యాసంలో వర్ణించిన పోలికలు చూస్తుంటే.. ఎల్లో టీమ్ లో ఫస్ట్రేషన్ ఏ లెవల్లో ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

 

జగన్ ఈ ఎల్లో టీమ్ దృష్టిలో ఎప్పుడూ విలనే కదా. అందుకే పురాణాల్లో విలన్లతో పోలిస్తే భలే వర్ణించారు మన చంద్రజ్యోతి సీబీఎన్ ఆర్కే. ఆయన ఏం రాశాడో తెలుసా.. 50 శాతానికిపైగా ఓట్లతో 151 సీట్లలో గెలిచిన తనకు ఇంత అవమానమా? అంటూ జగన్ రగిలిపోతున్నారట. అందుకే ఫలితమే శాసన మండలి రద్దుకు ప్రతిపాదనలట! అంతేనా.. మయసభలో పరాభవానికి గురైన దుర్యోధనుడు పాండవులపై అసూయతో రగిలిపోయినట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శాసనమండలిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అసూయ ద్వేషాలతో రగిలిపోయే వారు అంతిమ విజయాన్ని అందుకోలేరని చరిత్ర చెబుతోందట.

 

అమరావతి విషయంలో కూడా జగన్మోహన్‌ రెడ్డికి ఇదే అనుభవం ఎదురుకావొచ్చని చంద్రజ్యోతి భవిష్యవాణి వినిపిస్తోంది. ఇక ఊరూ పేరు పెట్టకుండా ఆయన అలా అన్నారు.. ఈయన ఇలా అన్నారు.. అని రాయడం సీబీఎన్ ఆర్కేకు మరో అలవాటు.. తన మనసులో మాటలు ఆయన అలా రాసేస్తుంటారు. తాజాగా అలా రాసుకొచ్చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని ఎవరు అడిగారు?’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు ఆంతరంగిక సంభాషణలలో ప్రశ్నిస్తున్నారట. ఆ మంత్రులు ఎవరో మాత్రం చెప్పరు. పాపం.. చంద్రజ్యోతి ఆర్కే రాతల్లోనే తేలిపోతోంది.. జగన్ నిర్ణయం వారిలో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: