ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ముందే.. ఎంతో మంది ఇతర పార్టీలను వదిలి జగన్ వెంట నడిచి ప్రస్తుతం వైసీపీలో ముఖ్య పదవిలో కొనసాగుతున్నారు. గతంలో పదవిలో ఉన్నవారు కూడా రాజీనామా చేసి మరి... జగన్ వెంట నడిచారు. అలా  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా నమ్మి ... జగన్ పోరాటం వెనుక నడిచిన నేతలు  ఎంతోమంది . ఈ క్రమంలోని జగన్ వెంట నడిచిన నేతల్లో ముందుగా గుర్తొచ్చేది... తానేటి వనిత. 2009 సంవత్సరంలో టిడిపి నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టిన తానేటి వనిత... ఆ తర్వాత మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చింది. 

 

 

 2009 సంవత్సరంలో పదవి వదిలి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తానేటి  వనిత.. ఆ తర్వాత ఎన్ని  ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ జగన్ వెంట నడిచింది. మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో తానేటి వనిత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి... ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతోంది తానేటి వనిత. ఇక  పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తానేటి వనిత.. ఎప్పుడూ సైలెంట్ గా ఉంటారు. ప్రతిపక్షాల పై విమర్శల విషయంలో కూడా ఎప్పుడు మౌనమే పాటిస్తూ ఉంటారు. మంత్రి తానేటి వనిత సైలెన్స్ మాత్రం మాటలకే పరిమితం అని స్పష్టంగా తెలుస్తోంది. 

 

 

చేతల  విషయానికి వస్తే మాత్రం మంత్రి తానేటి వనిత సైలెంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. తాను ఏం చేయాలనుకున్నాదో  అదే చేస్తూ ముందుకు సాగుతున్నారు తానేటి వనిత. జగన్  అభిరుచులు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  విజయం సాధిస్తున్నారు . వైసిపి మహిళా మంత్రుల్లో  ప్రస్తుతం వనిత విజయవంతంగా దూసుకుపోతున్నారు. అటు ప్రజలను ఎక్కడ నొప్పించకుండా తనదైన స్టైల్లో పాలన అందిస్తూ మంత్రిగా కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: