జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల కు  సంబంధించిన బిల్లును శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ శాసనమండలిలో మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు చుక్కెదురైన  విషయం తెలిసిందే. జగన్ సర్కార్ కు శాసనమండలిలో  తగిన మెజార్టీ లేకపోవడంతో... టిడిపి ఎమ్మెల్సీలు మెజార్టీ ఎక్కువ ఉండడంతో వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును... కమిటీకి పంపించాలంటూ  నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న శాసన మండలి రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా శాసనమండలిని కొనసాగించాలా వద్దా అనే దానిపై సోమవారం అసెంబ్లీలో చర్చిద్దాము  అంటూ చెప్పిన విషయం తెలిసిందే. శాసన మండలి అవసరమ   అంటూ అసెంబ్లీలో  సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 

 

 

 ఈ నేపథ్యంలో సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర రాజకీయాల్లో ఈరోజు అంశమే  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశం కంటే ముందు ఉదయం 9 గంటల సమయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించి... శాసన మండలి రద్దు పై చర్చించిన తర్వాత  మంత్రి వర్గం ఆమోదించిన తీర్మానాన్ని శాసనసభలో పెట్టనున్నారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాడు శాసన మండలి రద్దుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. 

 

 

 సోమవారం జరిగే శాసనసభా సమావేశానికి టిడిపి సభ్యులు హాజరు కావొద్దు  అంటూ నిర్ణయించింది టీడీపీ అధిష్టానం. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహ ముఖ్య నేతలందరూ సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాన్ని కి హాజరుకావద్దని  అంటూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాసన మండలి లో జరిగిన పరిణామాలను శాసనసభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధం.. ఈ సమావేశంలో నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగే శాసనసభ సమావేశానికి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఎవ్వరు ప్రలోభాలకు తలొగ్గకుండా నిర్ణయం  తీసుకోవడం వల్లె... జగన్మోహన్ రెడ్డి సర్కార్ శాసన మండలి రద్దు కు నిర్ణయం తీసుకుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: