త‌న‌దైన శైలిలో త‌న సొంత పార్టీ స‌హా ప్ర‌స్తుతం అధికార పార్టీపై ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తున్న విజ‌య వాడ ఎంపీ కేశినేని నానీపై అదే రేంజ్‌లో నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల అనంత రం టీడీపీలో త‌న‌కు ప్రాధాన్యం లేద‌నే అక్క‌సుతో సొంత పార్టీపైనే నాని విమ‌ర్శ‌లు సంధించారు. తీవ్ర‌స్థా యిలో సాగిన ట్వీట్ల యుద్ధంతో ఆయ‌న సెంట‌రాఫ్‌ది లీడ‌ర్‌గా వార్త‌ల్లో నిలిచారు. కొన్నాళ్ల‌కు ఆయ‌న త‌న యాంగిల్‌ను మార్చుకుని వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. విష‌యం ఏదైనా ట్విట్ట‌ర్‌లో చెల రేగిపోతున్నారు. 

 

నాని కొద్ది రోజుల క్రితం ‘‘ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్‌కు, ఆయన గ్యాంగ్‌కు, వైసీపీకి ప్రత్యేకమైన క్రిస్ట మస్, సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు. మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని  భగవంతుడిని కోరుకోండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే, గ‌త కొన్నాళ్లు గా నాని వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తున్న నెటిజ‌న్లు.. తాజాగా మాత్రం ఫైర్ అయ్యారు. రాష్ట్రంపై అంత ప్రే ముంటే.. పార్ల‌మెంటులో హోదా కోసం ప్ర‌య‌త్నం చేయండి ఎంపీ గారూ.. ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌తో మీరు కూడా పొద్దు పుచ్చితే.. ప్ర‌యోజ‌నం ఏంటి? అని వారు ప్ర‌శ్న‌లు సంధించారు.

 

అదే స‌మ‌యంలో విశాఖ‌ను రాజ‌ధానిగా చేసుకుంటాన‌ని చెప్పిన జ‌గ‌న్ వైఖ‌రిపై టీడీపీ మాటేంటో కూడా స్ప‌ష్టంగా చెప్పాల‌ని వారు ఎంపీని ప్ర‌శ్నిస్తున్నారు. పోనీ .. పార్టీ గురించి త‌మ‌కు తెలియ‌క‌పోతే.. మీ అభి ప్రాయం చెప్పండి! అని నిల‌దీస్తున్నారు. మిమ్మ‌ల్ని ఎంపీగా గెలిపించింది ట్విట్ట‌ర్ కాద‌ని, ప్ర‌జ‌లేనని, ట్విట్ట‌ర్ ఎంపీగా ఎందుకు మిగిలిపోతున్నారు? అని ప్ర‌శ్నిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో చేయాల్సిన ప‌నులు చాలానే ఉన్నాయ‌ని, వాటిని వ‌దిలేసి ఇలా ప‌నిలేని మ‌నుషుల మాదిరిగా ఉంటే ఏం జ‌రుగుతుంద‌ని వారు అంటున్నారు. మ‌రి వీటిని నానీ ఏవిధంగా ప‌రిశీల‌న చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: