మూలిగే నక్క మీద తాటికాయ పడటం ఇదేనేమో. అసలే గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న టీడీపీ పార్టీ, 23 మంది ఎమ్మెల్యేలు సాధించి తమ  ట్రాక్ రికార్డ్ లో ఇప్పటి వరకూ ఇలాంటి చెత్త రికార్డ్ క్రియేట్ చేయలేదని ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంటే. తాజాగా ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన ప్రకటన ఆ పార్టీని అయోమయ పరిస్థితిలోకి నెట్టేసింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి, తన కొడుకుని ముఖ్యమంత్రి చేసి రిటైర్ అయ్యిపోవాలని అనుకున్న చంద్రబాబు ఆశలపై టపీమని నీళ్ళు చల్లేసింది.

Image result for sajjala <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAMAKRISHNA' target='_blank' title='ramakrishna - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ramakrishna </a>reddy

మండలి రద్దు విషయంలో స్పందిస్తూ మీడియా ముందు మాట్లాడిన సజ్జల  సంచలన వ్యాఖ్యలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ మొహన్ రెడ్డి గారు, జనరంజకంగా పాలిస్తూ పధకాలు ప్రవేశ పెడుతుంటే. టీడీపీ కి బలమున్న మండలి వాటిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. చంద్రబాబు లా గ్రాఫిక్స్ లో రాజధానిని చూపించడం లేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని, అయినా మండలి చైర్మెన్ ని చెప్పు చేతల్లో పెట్టుకుని సైగలు చేస్తూ ప్రభావితం చేయడం సంస్కారమా అంటూ ఫైర్ అయ్యారు.

Image result for mandali chandrababu

జగన్ ఎదుగుతున్న నాయకుడు, చంద్రబాబు అంతరించిపోతున్న నాయకుడు అంటూ చంద్రబాబు ని వీర లెవిల్ లో కడిగేసిన సజ్జల మండలి రద్దు చేయకుండా అడ్డుపడటానికి తన 40 ఏళ్ళ అనుభవాన్ని రంగరిస్తున్నారని, మండలి విషయం అలా పక్కన పెట్టి ముందు తన 23 మంది ఎమ్మల్యేలలో ఎంత మంది తనతో నడవబోతున్నారో చూసుకోవాలని హితవు పలికారు. అంతేకాదు తమతో ఇప్పటికీ 17 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న సజ్జల, అన్నీ అనుకుంటే వారు వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి నిమిషం పట్టదని హెచ్చరించారు. అంతేకాదు

Image result for mandali chandrababu

తమ పార్టీ  ఎమ్మెల్సీలని బీజేపీ లోకి పంపేసి మండలి రద్దుని ఆపాలని అనుకుంటున్నా బాబు కి మరో షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు సజ్జల. మీ 17 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు సైతం తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే కోట్లు కుమ్మరించి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లని కొనుగోలు చేయాల్సిన అవసరం జగన్ మోహన్ రెడ్డి గారికి లేదని సజ్జల తెలిపారు. ఇప్పటికే షాకుల మీద షాకులు తగులుతూ భవిష్యత్తు అంధకారంగా మారిన టీడీపీ అధినేతకి సజ్జల వ్యాఖ్యలు మరో భారీ షాక్ ఇస్తాయనడంలో సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: