శాసన మండలి పరిస్థితి ఏమవుతుంది. జగన్ సర్కారు రద్దు చేస్తుందా.. లేక కొనసాగిస్తుందా.. అసలే కోపంగా ఉన్న జగన్.. మండలి ఆయువు తీసేస్తారా.. లేక కాస్త సమయమనం పాటించి.. భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుంటారా.. ఇప్పుడు అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. అయితే జగన్ మాత్రాం.. వస్తే లాగేద్దాం.. లేకుంటే మూసేద్దాం.. అనే కోణంలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

 

ఇప్పుడు ఈ జగన్ కొత్త ప్లాన్ టీడీపీని వణికిస్తోంది. వైసీపీ ఒక పక్క శాసన మండలిని రద్దు చేయనున్నామన్న సంకేతాలిస్తూనే.. మరో పక్క మండలిలో బలం పెంచుకునేందుకు వీలుగా ఇతర పార్టీ లకు చెందిన ఎమ్మెల్సీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ గుండెళ్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. జగన్ ప్రయత్నాలు ఫలించి మండలిలో మెజారిటీ వస్తే రద్దు ఆలోచనను విరమించుకునే అవకాశం ఉంది. వైసీపీ ఆలోచనను పసిగట్టిన ప్రతిపక్షం తమ ఎమ్మెల్సీలు జారిపోకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

 

అంతే కాదు.. శాసన మండలిలో ఇతర పార్టీల నుంచి వచ్చే సభ్యులతో బలం పెరిగిన తర్వాత ప్రస్తుత ఛైర్మన్ షరీఫ్ ను అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని జగన్ భావిస్తున్నారట. వైసీపీ సభ్యుడిని ఛైర్మన్‌గా చేయాలన్న వ్యూహంతో జగన్ ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు.. సెలక్టు కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఉపసంహరించుకుంటారట. వాటికి చిన్న చిన్న మార్పులతో ప్రవేశ పెట్టి ఉభయసభల ఆమోదం పొందుతారట.

 

ఇవాళ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి రద్దుకు నిర్ణయం తీసుకోవాలా.. లేక మెజారిటీ వస్తే కొనసాగించటమా అన్న అంశంపై జగన్ లోతుగా మంతనాలు జరిపారట. కానీ ఆయన వ్యూహం ఏంటన్నది ప్రస్తుతానికి అంతుబట్టకుండా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును గట్టెక్కించుకోకపోతే మండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు మాత్రం ఆత్మరక్షణలో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: