వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జిల్లాలకు వెళ్లినప్పుడు రెండో శ్రేణి నాయకులను,కార్యకర్తలను కలవలేకపోతున్నారా?ఈ అసంతృప్తి పార్టీలో పెరుగుతోందా అన్నదానిపై కధనాలు వస్తున్నాయి.ముఖ్యంగా చిత్తూరు జల్లాలో జగన్ పర్యటించిన సందర్బంలో ఈ సమస్య ఎదురైనట్లు కనిపిస్తున్నట్లు మీడియాలో కధనాలు వస్తున్నాయి.గత సెప్టెంబరులో జగన్ జైలు నుంచి విడుదల అయినప్పుడు చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. అప్పుడు కూడా జగన్ ను వీరు కలవలేకపోయారు. కొద్ది మంది నాయకులు మాత్రమ కలిశారు.  ఆ సందర్బంలో చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు కార్యకర్తలను కలుసుకుంటానని జగన్ చెప్పారు.ఇప్పుడు చిత్తూరు జిల్లాలో గత పది రోజులుగా ఆయన పర్యటిస్తున్నా పెద్ద నాయకులు మినహా మిగిలిన రెండో శ్రేణి నాయకులు,కార్యకర్తలు కలుసుకోలేకపోతున్నారట.కేవలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి, వారి వర్గానికి చెందినవారే కలుసుకోగలుగుతున్నారని అంటున్నారు.పైగా సెక్యూరిటీ గార్డులు కూడా దగ్గరకు రానివ్వడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో వారిలో కొంత నిరాశ వ్యక్తం అవుతోంది.మదనపల్లె,పీలేరు,చంద్రగిరి నియోజకవర్గాల కార్యకర్తలు ఈ విషయంపై గుసగుసలాడుతున్నారు.  అయితే ఇలాంటి అసంతృప్తులు కొంత సహజమేనని, ఒకవైపు జగన్ జనంలో పర్యటిస్తున్నప్పుడు వారిని ఎక్కువగా కలుస్తున్న విషయాన్ని కార్యకర్తలు అర్దం చేసుకోవాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదికారం రావడానికి ముందు ఇలాంటి సమస్యలు ఏ రాజకీయ పార్టీకి అయినా తప్పవు. జగన్ అటు నాయకులను,కార్యకర్తలను ఎలా సమన్వయం చేసుకోగలుగుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: