వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ శాసన మండలిని కొనసాగిస్తారా....? లేదా..? అనే విషయం రేపు తేలుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శాసన మండలి అవసరమా...? లేదా...? అనే అంశం గురించి చర్చ జరుగుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసన మండలి నిబంధనలను రాజకీయ లబ్ధి కొరకు తుంగలోకి తొక్కుతుందని అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా శాసన మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీకి శాసన మండలి లేకపోయినప్పటికీ ఎటువంటి నష్టం ఉండదని బొత్స సత్యనారాయణ చెప్పారు. తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్సీలను వైసీపీ ప్రలోభపెడుతోందని తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పారు. చంద్రబాబుకు శాసన మండలి రద్దయితే లోకేష్ కు పదవి పోతుందనే భయం పట్టుకుందని చెప్పారు. 
 
నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేడని బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసుకోవడం లేదని గతంలో తెలుగుదేశం పార్టీ గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఈనాడు పత్రిక శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలను సమర్థిస్తోందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 
 
బొత్స సత్యనారాయణ 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి బలం లేని సమయంలో ఎలా వ్యవహరించారో చంద్రబాబుకు గుర్తు చేశారు. బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉందనే ఒకే ఒక్క కారణంతో బిల్లును వ్యతిరేకిస్తోందని అన్నారు. మరోవైపు రేపు జరిగే శాసన సభ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండనుందని తెలుస్తోంది. సీఎం జగన్ మాత్రం శాసనమండలిని రద్దు చేస్తామని ఇప్పటికే తేల్చి చెప్పారు. రేపు అసెంబ్లీలో శాసన మండలి రద్దు కోసం ప్రభుత్వం తీర్మానం చేయనుందని తెలుస్తోంది. నిన్న కొందరు సన్నిహితులతో సీఎం జగన్ శాసన మండలి రద్దు గురించి సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: