దివంగత కోడెల శివప్రసాద్ ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఆయన అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు కేసులో చిక్కుకున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా, ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎలా మద్ధతు తెలిపారనేది కూడా ప్రజలకు తెలుసు. అలాగే ఆ సమయంలో కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మిలకు కూడా ఆయన సపోర్ట్ ఇస్తూ బాగానే నడిచారు.

 

అలా రెండు మూడు రోజులు హడావిడి చేసిన బాబు...ఇప్పుడు కోడెల వారసులని సైడ్ చేసేసినట్లే కనిపిస్తుంది. అసలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. పైగా వారు కూడా బాబుని నమ్ముకుని లేరని తెలుస్తోంది. ఆయన నమ్ముకుంటే ఇబ్బందులు తప్ప ఏం ఉండదని అర్ధమై, వారు కూడా పార్టీలో అడ్రెస్ లేరు. ఇటు సత్తెనపల్లి నియోజకవర్గంలో కనబడటం లేదు. దీంతో సత్తెనపల్లిలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు.

 

అయితే వరుసగా ఐదుసార్లు నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్...2014 ఎన్నికల్లో సత్తెనపల్లికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన ఎన్నికల్లో అంబటి రాంబాబుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇక తర్వాత నవ్యాంధ్రకి తొలి స్పీకర్‌గా పని చేశారు. స్పీకర్‌గా ఆయన పనితీరు ఎలా ఉందనే దానిపై 2019 ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కోడెల..అంబటిపై ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో అందరికి తెలుసు.

 

ఇక ఆయన మరణంతో సత్తెనపల్లిలో టీడీపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. అటు కోడెల వారసులని బాబు పక్కనబెట్టేయడంతో....కేడర్ కూడా చాలా వరకు పార్టీలో ఉండలేక...వైసీపీలోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వారసుడు రంగారావు సత్తెనపల్లి బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మొన్న ఎన్నికల్లోనే ఆయన సత్తెనపల్లి టికెట్ కోసం ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ బాబు ఇప్పటివరకు సత్తెనపల్లిలో ఇన్-చార్జ్ పెట్టడం లేదు. మరి చూడాలి కోడెల వారసులు పక్కకువెళ్లిపోవడంతో సత్తెనపల్లిలో టీడీపీని ఎవరు నడిపిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: