ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దూకుడు చూపిస్తున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ పని చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఈమె నిత్యం తమ నియోజక వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ,అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మ‌రోవైపు ర‌జ‌నీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. 

 

ఒక‌ర‌కంగా చెప్పాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రోజా తర్వాత అంతటి గ్లామర్, అంతటి దూకుడు కలిగిన నాయకురాలు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీయే అని చెప్పాలి. నిత్యం ఏదోఒక కార్యక్రమంతో మీడియాలో హల్ చల్ చేస్తుంటారు ఈమె. ఇక తాజాగా..  ఎమ్మెల్యే విడదల రజిని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ నేప‌థ్యంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రూ. 1,000 లంచం తీసుకున్న ఉద్యోగిని విడదల రజనీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అక్కడి అధికారులకు విడదల రజిని హెచ్చరికలు జారీ చేసారు. ఇటీవల తన పీఏ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వస్తే అతడి నుంచి రూ. 1,000 లంచం తీసుకున్నారని తెలిపారు. 

 

తన పీఏ దగ్గరే ఇలా వ్యవహరిస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని అక్క‌డ అధికారుల‌ను ప్రశ్నించారు. ఈ క్ర‌మంలోనే  రజిని లంచం తీసుకున్న సిబ్బందిని వెంటనే విధుల నుండి తప్పించాలని అధికారులకి ఆదేశమిచ్చారు. అయితే ఇలా ఇంకా ముగ్గురు అవినీతి అధికారులు ఉన్నట్లుగా తన దృష్టికి వచ్చిందని రజిని తెలిపారు. వారిపై నిఘా కొనసాగుతుందని అన్నారు. తన మనుషులు సామాన్య ప్రజల లాగ వచ్చి ఇక్కడ పరిస్థితుల ఫై ఆరా తీస్తారని అన్నారు. మ‌రోవైపు ఈ మొత్తం వీడియోను ర‌జ‌నీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో.. ఇది రాజన్న రాజ్యమని, జగనన్న పరిపాలనలో ఎక్కడా అవినీతి జరగటానికి వీల్లేదన్నారు. అవినీతికి పాల్పడే వారిపై వేటు తప్పదని హెచ్చరిస్తూ.. పోస్ట్ చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: