రాజకీయాల్లో విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో.....పొగడ్తలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాకపోతే అవి లిమిటెడ్ గా ఉంటే చాలా అర్ధంగా, అదిరిపోయేలా ఉంటాయి. కానీ అలా కాకుండా లిమిట్ దాటేస్తే ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇక్కడ విమర్శలు...రెండు ప్రత్యర్ధ రాజకీయ పార్టీల మధ్య ఉంటాయి. ఇక పొగడ్తలు సొంత పార్టీలో లేదా, అనుకూల వర్గాల నుంచి ఉంటాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతలు...తమ అధినేతని ప్రతి విషయంలోనూ పొగిడేస్తుంటారు. అయితే అక్కడ మేటర్ బట్టి పొగిడితే బాగానే ఉంటుంది...కానీ అలా కాకుండా ఓ స్థాయి దాటేస్తే చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి.

 

ఇప్పుడు ఇదే పరిస్తితి అధికార వైసీపీలో నెలకొంది. మామూలుగా జగన్‌కు...చంద్రబాబు లాగా ప్రచార హడావిడి ఉండదు. ఆయన ఎక్కువగా మీడియా ముందుకు కూడా ఎక్కువ రారు. ఏదైనా ఆయన చేతల ద్వారానే చూపిస్తారు. ఈ విషయం ప్రజలకు బాగా తెలుసు. అయితే ఈ విధంగా పెద్ద హడావిడి లేకుండా ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తున్న జగన్‌పై....ఈ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పొగడ్తల వర్షం కురిపించారు.

 

కొందరు మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ....ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకుంటే, ఆ గుండె...జగన్, జగన్ అని కొట్టుకుంటుందని ఓ ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే జగనన్న గోరుముద్ద(మధ్యాహ్న భోజనం) కోసం స్కూల్ పిల్లలు పొద్దున పూట ఏం తినకుండా వస్తున్నారని చెప్పారు. అలాగే ఇంకో ఎమ్మెల్యే మాట్లాడుతూ... మూడు రాజధానుల బిల్లుకు టీడీపీ అడ్డుపడిన నేపథ్యంలో చెబుతూ...మహేశ్ బాబు ఖలేజా సినిమాలో డైలాగ్ వినిపించారు. ‘నువ్ అనుకుంటే అవుతాది సామి. నీ మాట శాసనం, నీ నవ్వు వారం, నీ కోపం శాపం అంటూ ఓ డైలాగ్ వేశారు.

 

ఇలా మరికొందరు కూడా మాట్లాడారు. అయితే ఇలా మాట్లాడటంపై సొంత వైసీపీ కార్యకర్తలు కూడా కాస్త అసంతృప్తిగా ఫీల్ అయినట్లు తెలిసింది. చంద్రబాబుకు ఎలాగో భజన బృందాలు ఉంటాయి...ఆయన భజన లేకపోతే ఉండలేరు. కానీ అలాంటి వాటికి దూరంగా ఉండే జగన్‌పై ఈ విధంగా పొగడ్తల వర్షం కురిపించడం అనవసరమని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పైగా టీడీపీ సోషల్ మీడియా..వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వీడియోలని ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న వైసీపీ శ్రేణులు...పొగడ్తలు అర్ధవంతంగా ఉంటే ప్రజలకు చూడటానికైనా, వినడానికైనా బాగుంటాయని, అలా కాకుండా ఏదో భజన చేసినట్లు చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుందని, కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి భజన ఆపాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: