లోకం ఇప్పుడు వింత వింత పోకడలకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూడు మనుషులు మనుషుల్లా బ్రతకడం మానేసారు. కామసుఖాలు అనుభవించడం కోసం మాత్రమే ఈ జన్మ ఎత్తాం అనే భ్రమలో జీవిస్తున్నారు. ఇకపోతే కామన్‌గా అబ్బాయిని చూస్తే అమ్మాయికి.. అమ్మాయిని చూడగానే.. అబ్బాయికి ఆకర్షణ కలగడం సహజం. స్త్రీ పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణ సహజసిద్ధం. ఎందుకంటే  స్త్రీ పురుషుల శరీరాల్లోనే ఓ అద్భుతమైన అయస్కాతం ఉంటుంది.. కానీ.. ఓ మగాడికి. మరో మగాడి మధ్యే ఆకర్షణ చిగురిస్తే.. అది ఏ బంధం... దాన్ని ఏమని పిలవాలి..? ఇప్పుడు మన చుట్టూ ఇలాంటి వారే పెరుగుతున్నారు.

 

 

అయితే ఇంతకాలం లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి స్త్రీనే కోరుకున్న పురుషుడు.. ఇప్పుడు మనసు మార్చు కుంటున్నాడు. తనలాంటి మరో మగాడితో గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అదే.. మేల్ సెక్స్ విత్ మేల్. ఈ శృంగార పద్దతి మన దగ్గర శరవేగంగా విస్తరిస్తోంది. అసలు మగాడితో మగాడికి అవసరం ఎందుకు వస్తోంది అనేది ఇక్కడ ప్రశ్న...? ఇకపోతే వాళ్లూ మగాళ్లే... అందరిలాంటి వారే. కానీ, శృంగారం విషయంలో మాత్రం వారి ఫీలింగ్స్ వేరు. తోడు కోసం తపించినా వారికి కావాల్సింది స్త్రీ సాంగత్యం కాదు. పురుష సంభోగం.

 

 

తమలాంటి మగాళ్లతోనే ఏకాంతాన్ని కోరుకుంటున్నారు కొంతమంది మగాళ్లకు ఆడవాళ్లను చూస్తే రాని ఫీలింగ్.. మగాళ్లను చూడగానే మదిలో మొలకెత్తుతాయి. వారితో కాసేపన్నా గడపాలన్న కోరిక పుడుతుంది. హోమోసెక్స్‌ను ఎంజాయ్ చేయడానికి తమలాంటి వారికోసం అన్వేషణ మొదలుపెడతారు. అలాంటి వారు తారసపడితే, వారికి బంగారు నిధి దొరికినట్లే. ఇక ప్రపంచ వ్యాప్తంగా హోమో సెక్సువల్స్ పెరుగుతున్నారు. స్త్రీ,పురుషులు కలిసి జంటగా ఉండడం కన్నా, ఇద్దరు మగాళ్లే జంటగా ఏర్పడుతున్నారు.

 

 

ఫారిన్ కంట్రీస్‌లో ఇలాంటి వారికి ఆదరణ కూడా లభిస్తుండడంతో, ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. మన దగ్గర కూడా ఎంతో కాలంగా ఇలా మగాళ్లనే కోరుకునే మగాళ్లున్నప్పటికీ, వారి సంఖ్య ఈ మధ్యే వేగంగా పెరుగుతోంది. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేసిన సర్వే ప్రకారమే.. రాష్ట్రంలో పురుష స్వలింగ సంపర్కుల సంఖ్య 60 వేలు. ఇది అధికారికంగా గుర్తించిన సంఖ్య మాత్రమే. బయటపడకుండా.. గుట్టు చప్పుడుగా స్వలింగ సంపర్కాన్ని కొనసాగిస్తున్న వారు లక్షమందికి పైగా ఉండొచ్చన్నది స్వచ్ఛంద సంస్థల అంచనా.

 

 

నిజం చెప్పాలంటే శృంగారంలో స్త్రీ పాత్రను వీరు పోషిస్తారు. అయితే.. ఇది సెక్స్ ట్రేడ్‌లో భాగంగానే సాగుతుంది. ఓ రకంగా.. వీరు మగవేశ్యలన్నమాట. ఇకపోతే స్వలింగ సంపర్కం అసహజమైన ప్రక్రియే కావచ్చు.. కానీ, దాన్ని అంగీకరించాలా.. వద్దా అన్న విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే సాగుతోంది. కొన్ని దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరికొన్ని దేశాలు మరణశిక్షనూ విధిస్తున్నాయి. అయితే.. ఇద్దరు మగాళ్ల మధ్య బంధానికి మాత్రం చట్టబద్ధత లేదు. అందుకే, ఎంఎస్‌ఎంలకు పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఏది ఏమైన మన కట్టుబాట్లను కాదని నడిచే లోకానికి ఏదో విధంగా తగిన శాస్త్రి జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: