గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ టీడీపీలో కమ్మ నేతలు డామినేషన్ ఏ విధంగా సాగిందో అందరికీ తెలిసిందే. తమకు నచ్చిన విధంగా పార్టీలో డామినేట్ చేస్తూ, అధికారాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వీరి డామినేషన్ ఉండటం వల్ల...టీడీపీకి ఎప్పటి నుంచో అండగా ఉన్న వెనుకబడిన వర్గాలు కూడా దూరమయ్యాయి. అలాగే ప్రజల్లో కూడా టీడీపీపై తీవ్ర వ్యతిరేకిత వచ్చి....2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

 

అటు అధికారంలో ఉన్నప్పుడూ హడావిడి చేసిన నేతలు కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి దెబ్బకు వారు ఇక బయటకు రావడం మానేశారు. కానీ ఒక్కసారిగా జగన్ అమరావతిలో వారి చేసిన అక్రమాలని బయటకు తీయడం మొదలుపెట్టాక...ఒక్కో నేత బయటకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. మూడు రాజధానులు వద్దు...అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా డిమాండ్ చేసే చాలామంది నాయకులకు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆధారాలతో సహ బయటపెట్టింది.

 

మాజీ ఎమ్మెల్యేలు జి‌వి ఆంజనేయులు, ధూళ్లిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, బుచ్చయ్య చౌదరీ పేర్లు కూడా అందులో ఉన్నాయి. ఇక వీరిలో పుల్లారావుపై సి‌ఐడి్ కేసు కూడా నమోదు చేసింది. త్వరలోనే మిగతవారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నేతలకు సపోర్ట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై పదే పదే విచారణ చేసుకోండీ అని బాబు తెగ డైలాగులు వేశారు. ఇప్పుడు విచారణ జరుగుతుంటే బాబు సైలెంట్ అయిపోయారు. ఇది తమ కుటుంబానికి ఎలా చుట్టుకుంటుందనే దాని మీదే దృష్టి పెట్టి..వారిని వదిలేశారు.

 

దీంతో కమ్మ నేతలు బాబుపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు బాబు వల్లే, ఇన్వెస్ట్ చేసి..ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే గత ఐదేళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కమ్మ నేతలు ఇప్పుడు కష్టాల్లో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: