ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు  ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనికి బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం శాసనసభలో ప్రవేశ పెట్టగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు  శాసనసభలో అధిక మెజారిటీ ఉండడంతో సులభంగానే ఈ బిల్లుకు ఆమోదముద్ర పొందింది  కానీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు చిక్కులు వచ్చిపడ్డాయి.. శాసనమండలిలో అధికార వైసీపీ పార్టీకి తగిన మెజార్టీ లేకపోవడం.. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఎక్కువ మొత్తంలో మెజారిటీ కలిగి ఉండడంతో... ప్రతిపక్ష టీడీపీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే వికేంద్రీకరణ సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసనమండలి చైర్మన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శాసన మండలి పై ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 శాసన మండలి రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్నారు. అయితే మండలి రద్దుకు సంబంధించి ఇప్పటికే గురువారం జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. అసలు  శాసన మండలి అవసరమా అంటూ వ్యాఖ్యానించిన  ముఖ్యమంత్రి జగన్ శాసనమండలిని రద్దు చేయాలా వద్దా అనే దానిపై సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించుకుందాం అంటూ వ్యాఖ్యానించటం.. ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రేపు జరగబోయే శాసనసభ సమావేశంలో శాసనమండలి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 ఆనాడు టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శాసనమండలి నుండి  ఇబ్బందులు ఎదురవడంతో శాసన మండలి రద్దు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత శాసనమండలి రద్దుకు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఏపీ శాసనమండలి కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈరోజు ఉదయం 9 గంటలకు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లొ  శాసన మండలి రద్దు  తీర్మానంపై చర్చించి... అనంతరం ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో చర్చించి ఆమోద ముద్ర వేస్తారని అర్థమవుతుంది. శాసన మండలి రద్దు చేయాలని నిర్ణయించామని టిడిపి ఎమ్మెల్సీలను వైసీపీ లో చేర్చుకోవాల్సిన  అవసరం  లేదు అంటూ వైసీపీ నేతలకు  ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తెలిపినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం  చారిత్రాత్మకంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: