అనుకోకుండా ఏర్పడ్డ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. అది కాస్తా విడిచిపెట్టలేని వ్యసనం అయ్యింది. అంతే అది కాస్తా చివరకు హత్యకు దారి తీసింది. అక్రమ సంబధానికి అడ్డుగా ఉన్నాడని.. భార్య భర్తనే చంపించేసింది.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన ఎం.యాదగౌడ్ దంపతులు బతుకుదెరువు నిమిత్తం చ గాగిల్లాపూర్‌లో నివాసం ఉటున్నారు.

 

యాదగిరి గౌడ్ ఓ ఫైనాన్స్ సంస్థలో అతను పనిచేస్తున్నాడు. భార్య ఇంటి వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో వారి ఇంటికి సమీపంలో నివాసముండే డీసీఎం డ్రైవర్ ఆసితో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తన భార్య కొంతకాలంగా ఆసితో సన్నిహితంగా ఉంటున్నట్లు యాదగౌడ్ కు డౌట్ వచ్చేసింది. అంతే కాదు.. ప్రియుడు కొనిచ్చిన ఫోన్తో ఆమె తరచూ సంభాషిస్తున్నట్లు ప్రత్యక్షంగా చూసాడు.

 

దీంతో అతడి భార్య భయపడిపోయింది. మన వ్యవహారం భర్తకు తెలిసిందని, వేధింపులకు గురిచేస్తున్నట్లు ప్రియుడితో వాపోయింది. పదే పదే అతని వద్ద ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని వాపోయేది. దీంతో ఎలాగైనా యాదగౌడ్ అడ్డు తొలగించుకోవాలని భావించిన ఆసిఫ్ అందుకు పథకం సిద్ధం చేశాడు. సంక్రాంతి రోజు యాదగౌడ్ను దావత్ పేరుతో సమీపంలోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు.

 

ఇద్దరు మద్యం తాగిన తర్వాత.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆసిఫ్ వెనుక నుంచి యాదగౌడిపై దాడి చేశాడు. కిందపడిన అతనిపై విచక్షణరహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసుల విచారణలో ఈ వాస్తవం వెలుగు చూసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పిల్లలు అనాథలయ్యారు పాపం.. యాదగౌడ్ దంపతులకు ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు. ఇప్పుడు తండ్రి యాదగౌడ్ హత్యకు గురయ్యాడు. తల్లి జైలుకు వెళ్లింది. వారి పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందుకే వారిని అమ్మమ్మ వద్దకు పంపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: