అనిల్‌కుమార్ యాదవ్ నెల్లూరులో మంత్రి నారాయణపై పోటీ చేశారు.. 1,988 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెల్లూరు జిల్లా నుంచి ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారందర్ని పక్కనపెట్టి అనిల్‌ కుమార్ కు జగన్ మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రజా సమస్యలపై గట్టి గొంతు వినిపించారు.. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తారు. 

 

మంత్రి నారాయణతోనూ ఢీ అంటే ఢీ అంటూ.. తెలుగు దేశం ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపించారు. యువత కోటాలో అనూహ్యంగా మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. మంత్రిపై గెలిచి కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో అనిల్ కుమార్ యాదవ్ కు నీటి పారుద‌ల మంత్రిగా అవకాశం ఇచ్చారు.. 

 

అయితే మొదట నుండి అనిల్ కుమార్ కు కాస్త దూకుడు ఎక్కువ అనేది అందరికి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడాడో అలానే ఇప్పటికే ఏమాత్రం దూకుడు తగ్గించుకోకుండా మాట్లాడుతుంటారు అనిల్ కుమార్. అయితే నెల్లూరుకు చెందిన బీసీ నేత అనిల్ కుమార్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

 

సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన నీటి పారుద‌ల మంత్రిగా ఉన్న అనిల్ కుమార్‌.. షార్ప్ షూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. బ‌ల‌మైన విమ‌ర్శ‌ల‌కు కూడా చాలా తేలిక‌గా స‌మాధానం ఇస్తూ.. ఎదుటి ప‌క్షాన ఇరుకున పెడుతున్న‌తీరుకు మంచి మార్కులు ప‌డుతున్నాయి. అయితే ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ అంటే ప్రతిపక్ష నేతలు వణికిపోతున్నారు. 

 

అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో లేచాడు అంటే ప్రతిపక్ష అధినేత.. మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పిల్లిలా అయ్యి నోరు మేదపాడు అని బయట టాక్ కూడా ఉంది. ఎందుకంటే మంత్రి అనిల్ కుమార్ వేసే ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా చెప్పలేడు కాబట్టి. అంతేకాదు.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరులో మంచి పట్టు ఉంది.. అందుకే ఎంతోమంది కీలక నేతలను కాదు అని అనిల్ కుమార్ కు మంత్రిపదవి కట్టబెట్టారు. ఆలా ఇచ్చినందుకు ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకొని ఏపీలో టాప్ 10 మంత్రులలో పేరు సాధించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: