నగరాలు సహా పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నీటి కొరత ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మామూలుగానే నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక్కరోజు కూడా నీళ్లు రావడం ఆగిపోయాయి అనుకోండి వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతం గా ఉంటాయి. ఏం ఉన్న లేకున్నా  రోజు నీటి సదుపాయం మాత్రం పుష్కలంగా ఉండాలి ఉండాలి. లేకపోతే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. రోజురోజుకు నీటి వాడకం మరింత పెరిగి పోతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల నీటిని వృధా చేస్తున్నారు కూడా. 

 

 

 అయితే నీటిని వృథా చేయొద్దని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నీటి వృధా మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే హైదరాబాద్ నగరంలో ఎంతో మంది ప్రజలు కృష్ణ గోదావరి నుంచి పైప్లైన్ ద్వారా వస్తున్న నీటిని త్రాగునీటికి ఉపయోగిస్తారు అనే విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రజలు నదుల ద్వారా సరఫరా అయ్యే తాగునీటి పైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ క్రమంలోనే కృష్ణ నది నుంచి పైపు మార్గాల ద్వారా నగరంలోని పలు ప్రాంతాల వరకు నీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే కృష్ణా నది నుంచి తాగునీటి సదుపాయాన్ని పొంది జీవనం సాగిస్తున్న వారికి ప్రస్తుతం అధికారులు ఓ గుదిబండ లాంటి న్యూస్ చెప్పారు . 

 

 

 ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు అధికారులు చెప్పిన వార్త తో ఇబ్బందులు తప్పేలా లేవు. హైదరాబాద్ నగరానికి కృష్ణానది నుంచి పైప్లైన్ ద్వారా భారీగా తాగునీరు వస్తుంది అనే విషయం తెలుస్తుంది. హైదరాబాద్ నగరానికి వచ్చే కృష్ణ నీటి పైప్ లైన్ కు భారీగా లీకులు  ఏర్పడడంతో.. మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఈనెల 29 ఉదయం 6 గంటల నుంచి ఈనెల 30 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఫిబ్రవరి 21 కల్లా అక్రమ నల్లా కనెక్షన్ ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి లేకపోతే భారీ జరిమానాలు తప్పవు అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: