ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని రోజుల వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులపై  బిజెపి విమర్శలు చేసినప్పటికీ వైసీపీ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ డైరెక్ట్ గా  విమర్శలు చేయలేదు. ఇప్పుడు వైసిపి తన పంతం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా డైరెక్ట్ అటాక్ ప్రారంభిస్తుంది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మూడు రాజదానుల అంశంపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్పు  రాష్ట్ర పరిధిలోని అంశమని దానికోసం  ఎవరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని... ఏపీ బీజేపీ నేతల అనుమతి అసలే  అవసరం లేదు అంటూ  తెలిపారు అంబటి . అమరావతిలో రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డగా  మారిందని గతంలో బిజెపి విమర్శించింది అని కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు అండదండలు  అందిస్తుంది అంటూ విమర్శించారు అంబటి రాంబాబు. ఎన్నికల్లో అఖండ మెజారిటీని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు అంటూ తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని  స్పష్టం చేశారు. 

 

 

 కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలకు వైసీపీ ప్రభుత్వం బాహాటంగానే మద్దతు ప్రకటించిందని.. ఏపీ బిజెపి నేతలు మాత్రం జగన్ సర్కార్ కు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అంటూ విమర్శించారు. బిజెపి జనసేన పార్టీలు  చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారు అంటూ ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తామంటూ బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. 

 

 అయితే ఇన్ని రోజులు వరకు బిజెపి ఎన్ని విమర్శలు చేసినప్పటికీ... వైసిపి నేతలు మాత్రం బిజెపి నేతలపై విమర్శలు చేసిన దాఖలాలు చాలా ఎక్కువ. ప్రస్తుతం మాత్రం బీజేపీ పై వైసీపీ పార్టీ మెతక వైఖరి వీడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ పార్టీ బీజేపీపై డైరెక్ట్ ఎటాక్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపి జనసేన తో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానిల పై పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా తమకు బీజేపీతో ఉన్న అనుబంధాన్ని కేంద్రాన్ని వరకే పరిమితం చేసి ఏపీ బీజేపీ నేతల పై డైరెక్ట్ గా ఎటాక్  చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: