కోడలి నాని.. తెలుగు దేశం పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004 నుండి 2019 వరుకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అధిష్టానం పవర్ పోగుట్టుకుంది కానీ అతను మాత్రం పవర్ లేకుండా లేరు.. రాజకీయంలోకి అడుగు పెట్టినప్పటి నుండి ఓటమి లేకుండా ప్రజలతో నమ్మకంగా ఉన్న వ్యక్తి కోడలి నాని.. 

 

జూనియర్ ఎన్టీఆర్ కు బాగా సన్నిహితుడు కోడలి నాని.. అలాంటి కోడలి నానిని చంద్రబాబు పక్కనపెట్టడం.. నందమూరి ఫ్యామిలీని రాజకీయాలలో అవమానించడంతో ఈయన ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడైన కొడాలి నానికి కూడా బాబు ఇబ్బందులు పెట్టడంతో ఆ అవమానాలను తట్టుకోలేక వైసీపీలో చేరారు. 

 

వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు.. జగన్ ఓటమిలోను తనతోనే అడుగులు వేశారు.. అందుకే.. కోడలి నాని సమర్ధతకు సీఎం జగన్ మంచి అవకాశం ఇచ్చారు. అదే మంత్రి పదివి ఇచ్చారు. అందుకే వైసీపీ పార్టీని కానీ సీఎం జగన్ ని కానీ ఏమైనా అన్నారు అంటే చుక్కలు చూపిస్తాడు కోడలి నాని. 

 

చంద్రబాబుకు కమ్మ కులం అని అన్నాడు అంటే చాలు.. తనదైన శైలిలో స్వీట్ హాట్ వార్నింగ్ లు ఇస్తూ వెళ్తాడు... వివాదం ఆయ‌న కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది... అయినప్పటికీ మంత్రిగా మాత్రం ఆయ‌న దూకుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మేలు చేస్తోంద‌ని రాజకీయ విశ్లేషకులు అంటారు. 

 

ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న అభూత క‌ల్ప‌న‌ల‌కు, ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌కు ఘాటుగా ఈ మంత్రి జ‌వాబు ఇస్తుండ‌డంతో ప్ర‌తిప‌క్షం ఒకింత వెన‌క్కి త‌గ్గుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజమే.. ఆ విమర్శ ఏది అయినా.. నైస్ గా మాట్లాడుతూనే చురకలు అంటిస్తారు.. చమటలు పట్టిస్తారు.. అందుకే సీఎం జగన్ టాప్ 10 ముఖ్యమంత్రుల్లో కోడలి నాని పేరు ప్రత్యేక స్థానంలో నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: